Tag Archives: rtgs fund transfer

బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్బీఐ..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో బ్యాంకు ఖాతా కలిగి ఉన్న వారందరికీ అదిరిపోయే శుభవార్తలు చెప్పింది. ఆర్బీఐ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. బ్యాంకు ఖాతాదారులకు ఇకపై రోజంతా ఆర్టీజీఎస్ అందుబాటులో ఉంటుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఫెసిలిటీ డిసెంబర్ నెల నుంచి అందుబాటులోకి రానుందని చెప్పారు.

ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపేవాళ్లు మాత్రమే ఆర్టీజీఎస్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పటివరకు బ్యాంకు పనివేళల్లో మాత్రమే ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉండేది. కనీసం 2 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం అవతలి వ్యక్తులకు బదిలీ చేయడానికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే వినియోగదారులు ఆర్బీఐ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వడ్డీ రేట్ల విషయంలో సైతం ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆర్బీఐ కీలక సమీక్షలో వడ్డీరేట్లను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. శక్తి కాంత్ దాస్ సారథ్యంలో జరిగిన సమావేశంలో ఎంపీసీ కమిటీ సభ్యులు వడ్డీరేట్లను స్థిరంగా ఉంచడానికి మొగ్గు చూపారు. ఆర్బీఐ నిర్ణయం వల్ల రెపో రేటు 4 శాతం వద్ద కొనసాగుతుండగా రివర్స్ రెపో రేటు 3.35 శాతం దగ్గర కొనసాగుతోంది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి ప్రయోజనం చేకూరనుంది. 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 250 పాయింట్ల వరకు తగ్గించింది. ఫలితంగా రెపోరేటు 2.5 శాతం తగ్గిందని చెప్పవచ్చు. కరోన వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది.