Tag Archives: Rythu Bharosa Scheme

వైయస్సార్ రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాలేదా.. ఏం చేయాలంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమలు చేస్తున్న స్కీమ్ లలో వైయస్సార్ రైతుభరోసా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. ఈ 13,500 రూపాయలలో కేంద్రం నుంచి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీన పీఎం కిసాన్ స్కీమ్ నగదు జమ కాగా ఆ స్కీమ్ ద్వారా 2,000 రూపాయలు జమ కాని రైతుల ఖాతాలలో జగన్ సర్కార్ 29వ తేదీన 2,000 రూపాయల చొప్పున 1,766 కోట్ల రూపాయలు జమ చేసింది. అర్హులైన రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమైంది. రైతు భరోసా నగదుతో పాటు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 646 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోంది.

అయితే ఇప్పటికే ప్రభుత్వం నగదు జమ చేయగా ఏదైనా కారణం వల్ల నగదు క్రెడిట్ కాకపోతే 155251 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కు కాల్ చేయడం ద్వారా నగదు ఎందుకు జమ కాలేదనే వివరాలను తెలుసుకోవచ్చు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను పొందవచ్చు. రైతులకు పెట్టుబడి సాయంలో భాగంగా జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ స్కీమ్ తో పాటు జగన్ సర్కార్ వైయస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఈ స్కీమ్ కు అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించి సరైన ధృవపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.