Tag Archives: salary of 42000

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ. 42,000 వేతనంతో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర గృహ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎన్‌బీసీసీ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌బీసీసీ (ఇండియా) నిరుద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్క‌ష‌న్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.nbccindia.com/ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 100 ఇంజనీర్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా వాటిలో 80 సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు, 20 మెకానికల్ ఉద్యోగాలు ఉన్నాయి.

బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాళ్లు 550 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 42,000 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కష్టపడి ప్రయత్నిస్తే సులువుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం సాధ్యమే.