Tag Archives: sanitizer theft

ఏటీఎం సెంటర్‌లో అలాంటి పని చేసిన వ్యక్తి.. వైరల్ వీడియో

సాధారణంగా కొందరు మనుషుల ఆలోచనా ధోరణి, వారి ప్రవర్తన ఎప్పటికీ ఎవరికీ అర్థం కావు. కొన్నిసార్లు కొందరు వారికి ఎటువంటి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనను ఆచరణలో పెడుతుంటారు. ఈ విధంగా కొందరు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులలో ఉందో మనకు తెలిసిందే. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్కు ధరించి, శానిటైజర్ వాడటం ఎంతో ఉత్తమం.

మొదటి దశ కరోనా వ్యాపించినప్పుడు శానిటైజర్ లో కొరత అధికంగా ఉండేది. దీంతో ఎంత ధర అయినా కూడా చెల్లించి కొనేవారు. కానీ ప్రస్తుతం శానిటైజర్ లో కొరత లేకుండా ఎక్కడైనా మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన పని నిమిత్తం బ్యాంకు వెళ్లిన, ఏటీఎం వెళ్లిన, షాపింగ్ మాల్ వెళ్లిన, హోటల్ వెళ్లినా అక్కడి సిబ్బంది మనకు శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి సమయాలలో కూడా కొందరు వాటిపై వారికి ఉన్న కక్కుర్తి బయట పెడుతూ ఏదోవిధంగా శానిటైజర్ లను దొంగతనం చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఒక ఏటీఎం లోకి వ్యక్తి డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వెళ్లారు. అయితే అక్కడ శానిటైజర్ ఉండడంతో చేతులు శానిటైజ్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతని చూపు అక్కడ ఉన్న శానిటైజర్ బాటిల్ పై పడింది. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో పాటు మొహానికి ఉండటంవల్ల తనని ఎవరు గుర్తుపట్టరనే ధీమాతో అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ బాటిల్ తీసి తన బ్యాగ్లో వేసుకుని ఏం తెలియనట్టు హుందాగా బయటికి వెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లు ఉంటే… శానిటైజర్లను కూడా సెక్యూర్ చేయడం కోసం ఒక బోన్ ఏర్పాటు చేయాలి. దానికి 200 -300 వరకు ఖర్చు అవుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో పై పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.