Tag Archives: Single Lung

ఒకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకోవాలి.. అయినా దైర్యంగా కరోనాను జయించిన చిన్నారి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తూ ఎంతో ఆరోగ్యవంతమైన ప్రజలను సైతం కుంగదీసి వారిని మరణం అంచులకు తీసుకెళ్ళింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆరోగ్యవంతులు యువకులు మృత్యువాతపడ్డారు. ఒక సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి ఈ వైరస్ ఎంతో ప్రమాదకరంగా మారింది. కానీ ఓకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకునే చిన్నారిపై మహమ్మారి పంజా విసిరింది. అయితే ఆ చిన్నారి ధైర్యం కోల్పోకుండా ఆమె ధైర్యానికి కరోనా పారిపోయింది.

ఇండోర్ లోని సంఘీ కాలనీలో నివసిస్తున్న ఎలక్ట్రిక్ వ్యాపారవేత్త అనిల్ దత్ రెండో కుమార్తె సిమి. 2008వ సంవత్సరంలో సిమి గర్భంలో ఉన్నప్పుడు సోనోగ్రఫీ జరిగింది. అప్పుడు వైద్యులు తన ఆరోగ్యం బాగుంది అని చెప్పారు. కానీ తను పుట్టిన తర్వాత తనకు ఎడమ చేయలేదు, అదేవిధంగా మూత్రపిండాలు సరిగా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ తన కూతురును ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు.

వయసు పెరిగే కొద్దీ సిమి ఒక ఊపిరితిత్తి కూడా క్రమంగా కుచించుకుపోవడంతో ఆమెకు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రతిరోజు రాత్రి ఆక్సిజన్ అందించే వారు. ఈ కరోనా సమయంలో చిన్నారిని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి తల్లి కరోనా వ్యాధి బారిన పడటంతో చిన్నారి సిమికి కూడా కరోనా సోకింది.

కరోనా సోకిన సమయంలో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నఫలంగా 50కి పడిపోయాయి.సిమి కుటుంబం డాక్టర్ ముతిహ్ పరియకుప్పన్ ను సంప్రదించింది. ఇంట్లో, అమ్మాయికి బిపెప్, ఆక్సిజన్ ఇచ్చారు. సుమారు 12 రోజుల పాటు ఇదే పరిస్థితిలో ఉన్న సిమి చివరికి మహమ్మారితో పోరాడి జయించింది. ఈ విధంగా ఒకే ఊపిరితిత్తితో ఆక్సిజన్ తీసుకున్నప్పటికీ ఎంతో ధైర్యంగా కరోనాను జయించి ఆ ఎంతో మందికి ధైర్యంగా నిలిచింది.