Tag Archives: skull operation case

అతడికి పుర్రె లేకుండానే వైద్యులు ఆపరేషన్ చేశారు.. ఎందుకు ఇలా చేశారంటే..!

మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన కీర్తి పార్మర్ కు కొన్నేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతడు ఇండోర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిశాడు. స్కానింగ్ చేసిన వైద్యులు బ్యెయిన్ ట్యూమన్ ఉందని.. దానిని తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు. దీంతో అతడు 2019లో ఆపరేషన్ చేయించుకున్నాడు. పుర్రెలోని కుడివైపు భాగాన్ని పగలకొట్టి ట్యూమర్ తొలగించారు. తర్వాత ఆ పుర్రెను అతికించకుండానే చర్మంతో కుట్టేశారు. ఎందుకు అలా చేశారంటే.. బయటకు తీసిన ఆ పుర్రె పగిలిపోయింది.

అందువల్ల ఇక అతను ఎప్పటికీ ఆ పుర్రె ముక్క లేకుండానే బతకాల్సి వస్తోంది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పుర్రె ముక్క లేకుండానే ఆపరేషన్ పూర్తి చేసేశారనీ… తమకు న్యాయం చెయ్యాలని కీర్తి పార్మర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ.. అతడికి మెదడులో అయింది చిన్న గడ్డ కాదు.. దాన్ని తొలగించాలంటే పుర్రెలోని కీలక భాగాన్ని తొలగించక తప్పలేదు.

తర్వాత దానిని తిరిగి అమర్చాలంటే… ఆ పుర్రె ముక్క పద్ధతిగా ఉండాలి. కానీ ఆపరేషన్ సమయంలో… పుర్రె ముక్క పద్ధతిగా రాలేదు. ముక్కలైపోయింది. ఇలా జరిగే అవకాశం ఉందనీ… అలా జరిగితే… పుర్రెను తిరిగి సెట్ చెయ్యడం కుదరదని ముందే చెప్పినట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. వారు దానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. అంచనా వేసినట్లుగానే అది ముక్కలైపోయింది. కాబట్టి… తిరిగి సెట్ చెయ్యడం కుదరలేదన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసి బాధిత కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ కోరారు. పేషెంట్ వైపు నుంచి చూస్తే అయ్యో అనిపించడం సహజం. వైద్యులు విషయానికి వస్తే వాళ్లు ఆపరేషన్ పూర్తి చేశారు. కానీ వాళ్లనే నిందించడం అనేది పద్దతి కాదంటూ పోలీసులు తెలిపారు. దీనిపై చివరకు ఎవరు రాంగ్.. ఎవరు తప్పు అనేది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.