Tag Archives: software employee

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

Fake Covid Certificate: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కోవిడ్ లాంటి వ్యాధి ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు.. విని ఉండరు కూడా. ఈ వ్యాధికి ఎండింగ్ అనేది లేకుండా.. వేవ్ ల మీద వేవ్ లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తుంది. అయితే ఈ వ్యాధి పాండిమిక్ తరహాలో విపరీతంగా వ్యాపిస్తోంది.

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

అది కాక ఈ వ్యాధి అంటువ్యాధి కావడంతో.. ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే.. మిగతా వారికి ఆ వ్యాధి సోకుకుండా వారికి పెయిడ్ సెలవులను కల్పిస్తున్నారు కొన్ని కంపెనీలు. అయితే ఇలా కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చేసే ఉద్యోగులు ఇదే ఆసరగా తీసుకుంటూ.. తప్పుడు దారిలో వెళ్తున్నారు.

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు సెలవులతో పాటు.. ఆ వ్యాధి నెగిటివ్ వచ్చే వరకు సెలవులు ప్రకటించే కంపెనీలు ఉన్నాయి. దీంతో కొంత మంది కరోనా పాజిటివ్ లేకున్నా.. సెలవుల కోసం కరోనా పాజిటివ్ వచ్చిందంటూ.. కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల నుంచి కోవిడ్ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చి.. సెలవులను తీసుకుంటున్నారు.


నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి..

ఇటీవల ఇలా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఓ మహిళా ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఆ ఉద్యోగి పట్టుపడింది. ఇలా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న మహిళ తనకు కొవిడ్‌ పాజిటివ్‌ అంటూ ఓ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నుంచి తెచ్చిన సర్టిఫికెట్‌ సమర్పించి సెలవులు తీసుకుంది.
దీనిపై ఆ కంపెనీ హెచ్ఆర్ టీం సభ్యులు విచారణ చేపట్టారు. దీంతో అది నకిలీది అని తేలడంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ ఉద్యోగిపై యాజమాన్య చర్యలు తీసుకుంది. దీంతో అప్రమత్తమైన సదరు హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి.. మోసం చేశారో అనే కోణం విచారణ చేపడుతున్నారు. ఇటువంటివి చాలా కంపెనీల్లో జరిగినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.