Tag Archives: software emplyoee

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు.. నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతమందికి మంచి ఉద్యోగం.. లక్షల్లో సంపాదన ఉన్నా సరిపోదు. ఇంకా ఏదో చేయాలి.. ఇంకా సంపాదించాలి అనే కోరిక, ఆశలు ఉంటాయి. ఇలా ఆశపడి నిరాశలో కుంగిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అతడు సాప్ట్ వేర్ ఉద్యోగిగా మంచి జీతంతో పనిచేస్తున్నాడు. పార్ట్ టైంలాగనే స్టాక్ మార్కెట్లో అతడు ఇన్ వెస్ట్ చేసి.. డబ్బులను సంపాదిస్తున్నాడు. రెండు చేతులా అతడు మూడు పువ్వులు.. ఆరు కాయలు లాగా అతడి జీవితం సాగిపోతుంది.

ప్రస్తుతం అతడు కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే పని చేస్తున్నాడు. అటు ఆ వ్యవహారం చూసుకుంటూ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో చిత్తూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన భరత్‌ (23) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా చేస్తున్నాడు.

కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ సాప్ట్ వేర్.. తనను తాను ఆదుకోవడానికి ఆశతో ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మొదట కొద్దో గొప్పో లాభాలు బాగానే వచ్చాయి. కానీ ఓ రోజు దురదృష్టం అతన్ని వెక్కిరించింది. స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి.. ఆశగా రిటర్న్స్ కోసం ఎదురు చేశాడు. కానీ అతడికి అదృష్టం వరించలేదు.

పెట్టుబడి పెట్టిన డబ్బులు అన్నీ పోయాయి. దీంతో అతడు చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లాడు. కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. పోస్టు మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులు వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు.