Tag Archives: sweat

చమట వల్ల శరీరం దుర్వాసన వస్తుందా.. అయితే ఈ ఒక్క టిప్ పాటించండి!

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యానికి ఉష్ణోగ్రత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వేసవి కాలంలో అయితే ఉష్ణోగ్రత గురించి చెప్పనక్కర్లేదు. ఆ వేడికి ఫ్యాన్, కూలర్లు పనికి రావడం లేదు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం నుండి చెమట ఎక్కువగా వస్తుంది. అందరి శరీరం తీరు ఒకే విధంగా ఉండదు. కొందరికి చలి కాలంలో కూడా చిన్న పని చేసిన చెమట పడుతుంది. అలాంటిది వేసవికాలంలో అయితే వారి బాధ వర్ణనాతీతం.

మన శరీరం నుండి వచ్చే చెమట వల్ల దుర్వాసన వస్తుంది. చాలామంది ఇది దుర్వాసనను నియంత్రించడానికి పౌడర్ రాసుకోవడం లేదా ఈమధ్య ఆడ, మగ చిన్న ,పెద్ద అని తేడా లేకుండా పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. ఇలా వాటిని వాడటం వల్ల దుర్వాసనను నియంత్రించవచ్చు అనుకుంటే పొరపాటే. అవి కొద్ది సేపు మాత్రమే చెమటవాసన రాకుండా చేస్తాయి.

పౌడర్ , పర్ఫ్యూమ్ కాకుండా ఇంటిలో కూడా చెమట వాసన రాకుండా కొన్ని చిట్కాలను వాడవచ్చు. ఇప్పుడు మనం ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వేసవికాలంలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులు ధరించడం వల్ల అవి చెమటను పీల్చుకుని చెమట వాసన రాకుండా కాపాడుతాయి.

ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఒకటి లేదా రెండు టమాటా పండ్ల రసాన్ని కలుపుకొని స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన నుండి విముక్తి పొందవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం తాజాగా ఉండి దుర్వాసన రానివ్వదు.

నిమ్మకాయలో ఎన్నో ఆంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని రోజు వేడి నీటిలో కలుపుకొని తాగడం వల్ల అనేక సీజనల్ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. నిమ్మరసం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చెమట నుండి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. ఈ విధమైనటువంటి చిట్కాలు పాటించడం వల్ల శరీరం నుంచి దుర్వాసన రాదు.

శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుంది?

సాధారణంగా మన శరీరానికి చెమట పట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చాలామంది శారీరక శ్రమ చేయడం వల్ల వారి శరీరం నుంచి అధిక మొత్తంలో చెమట విడుదల అవుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ఏవిధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా పనులు చేయటం వల్ల వారిలో కొద్దిగా చెమట రాగానే ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. చెమట రాకుండా తగినన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అసలు మన శరీరం నుంచి చెమట ఎందుకు వస్తుంది. చెమట రావడం మంచిదేనా… చెమట బయటకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

మనం ఏదైనా శారీరక వ్యాయామాలు చేస్తున్న సమయంలో మన శరీరం నుంచి చెమట బయటకు వెలువడుతుంది. ఈ విధంగా మన శరీరం నుంచి చెమట బయటకు వెళుతుంది అంటే మన శరీరంలో పేరుకుపోయిన అమ్మోనియా, సోడియం, యూరియా, చక్కెర వంటి మొదలైన వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో శరీరంలోని నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా వ్యాయామం చేస్తున్నప్పుడు అధికంగా చెమటలు రావడం వల్ల మన గుండె వేగంగా కొట్టుకొని, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

చెమట రూపంలో మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వల్ల చర్మం బాగా శుభ్రం అయ్యి మన శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే మన చర్మం పై చెమటలు ఏర్పడటం వల్ల మన మొహం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అధికంగా చెమట పట్టడం వల్ల స్వేదగ్రంథులు తెరచుకొని మన చర్మంలో పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాలను తొలగింప చేసి చర్మం కాంతివంతంగా మెరవడానికి దోహదపడుతుంది. ప్రతిరోజు మనం శారీరక వ్యాయామం చేయటం వల్ల వెలువడే చెమట ద్వారా మన శరీరంలో రోగ నిరోధకశక్తి బలపడుతుంది తద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.