Tag Archives: tractor symbol

రూ.5 ల నోటు పై ఈ బొమ్మ ఉంటే లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.. కానీ!

ఈ ప్రపంచం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఎంతో ముందుకు పోతుంది. కానీ ఈ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇప్పటికీ ఎంతోమంది వెనుకబడే ఉన్నారు. ఇప్పటికీ కొందరి మాటలను ఎంతో అమాయకంగా నమ్ముతూ నిలువునా మోసపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఇటువంటి సంఘటనలను గురించి మనం ఎన్నో విన్నాం. తాజాగా ఇటువంటి సంఘటనే కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నర్సింహులు అనే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. పాత రూ.5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే మీకు రూ.11.74 వస్తాయని ఎంతో నమ్మకంగా చెప్పాడు.అతని మాటలను నమ్మిన నరసింహులు ఎలాగైనా డబ్బులను సొంతం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే అవతలి వ్యక్తి చెప్పిన విధంగానే నర్సింహులు రూ.8.35 లక్షల రూపాయలను జమ చేశాడు.

ఆ పదకొండు లక్షల రూపాయలను పొందడం కోసం ఖాతా తెరవాలని, మరోసారి కాల్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం డబ్బులు అవసరం అవుతాయని, మరోసారి ఐటీ క్లియరెన్స్ కోసం అంటూ సుమారు పది సార్లు నరసింహులకి ఫోన్ చేసి సుమారు 8 లక్షల రూపాయల వరకు నిలువు దోపిడీ చేశారు.ఈ విధంగా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసిన అవతలి వ్యక్తి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానం కలిగింది.

ఈ క్రమంలోనే నరసింహులు తను మోసపోయానని గ్రహించి దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అతనికి ఫోన్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్ ఆధారంగానే పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి మోసపూరిత ఫోన్ కాల్స్ గురించి పోలీసులు ఇప్పటికే ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజలు తరచూ ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు.ఇప్పటి నుంచైనా ఇటువంటి నేరగాళ్ల పట్ల జాగ్రత్తలు వహించాలని పోలీసులు మరోసారి తెలియజేసారు.