Tag Archives: upasana

క్షణాల్లో లక్ష రూపాయల రుణం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో చాలామంది దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దేశంలోని చాలామందికి కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామందికి షాపింగ్ చేయాలని ఉన్నా డబ్బులు లేకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు మొబిక్విక్ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. అమరికన్ ఎక్స్ ప్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్న మొబిక్విక్ క్రెడిట్ కార్డుల్లాంటి వర్చువల్ ప్రిపెయిడ్ పేమెంట్స్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. మొబిక్విక్ ప్రిపెయిడ్ కార్డుల ద్వారా సంస్థ మరింత ఎదిగేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం మొబిక్విక్ వాలెట్ సర్వీసుల సంస్థ కాగా ఆ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

మొబిక్విక్ కో ఫౌండర్ ఉపాసన ఈ విషయాలను వెల్లడించారు. మొబిక్విక్ యాప్ ను ఉపయోగించే కస్టమర్లు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని.. మొబిక్విక్ బ్లూ కార్డుతో తమ సంస్థ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఉపాసన చెప్పారు. ఈ కార్డును పొందాలనుకుంటే మొబిక్విక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో హోం స్క్రీన్ పై ఉండే కార్డును యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మొబిక్విక్ కు 12 కోట్ల మంది యూజర్లు ఉండగా ఇప్పటికే 2 లక్షల మంది కార్డులను పొందగలిగారు. కార్డుల ద్వారా షాపింగ్ చేసేవాళ్లు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.