Tag Archives: vacancies

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా విమర్శించారు. 

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తమ విభజన డిమాండ్ల సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

రాజ్యసభలో జీరో అవర్ లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవతున్నా… కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి, గిరిజన యూనివర్సీటీని ఏర్పాటు చేయలేదని కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.


విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ..

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్ట్ కేసులతో ఒక పరీక్ష మూడేళ్ల పాటు నడుస్తోందని… దీని వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

Jobs In AP: ఐఐటీలో చదవాలనేది ప్రతి విద్యార్థి కోరికగా ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మక యూనివర్సీటీలో ఉద్యోగాలు చేయాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారికి ఓ సదవకాశం. ఏపీలోని తిరుపతి ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఔట్ సోర్సింగ్  ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరకాస్తులు కోరతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలనను భర్తీ చేయనున్నారు.   భర్తీ చేయనున్న పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఆఫీసర్లు 3, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు 3 ఖాళీలు ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్, నెట్వర్క్ విభాగాల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలను కూడా నోటిఫికేషన్ లో పొందుపరిచారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పోస్టులకు అర్హులు. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 

నెలకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ..

సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రాజెకట్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ, బీఎస్సీ సీఎస్, బీసీఏ డిగ్రీలు కలిగిన వారు అర్హులు. అయితే కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంట్లో కూడా అనుభవం, టెక్నికల్ నైపుణ్యత కలిగి ఉండాలి. నెలకు రూ. 20,000 నుంచి రూ. 30000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిల్లో జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11,2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు  https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో చూడాలి.