Tag Archives: vande bharat trains

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

Trains: దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోంది. దీనికోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎక్కడిక్కడ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది.

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇదిలా ఉంటే స్థిరమైన ప్రభుత్వంతో పాటు, హైదరాబాద్ కు ఉన్న భౌగోళిక అనుకూలతలు పెట్టుబడును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే కమర్షియల్ హబ్ గా హైదరాబాద్ మారుతోంది. ప్రభుత్వం తీసుకున్న సులభతర అనుమతులు కూడా పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రావడాని దోహదపడుతున్నాయి. 

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇంతలా డెవలప్ అవుతున్న హైదరాబాద్ మరిన్ని సౌకర్యాలు రాబోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదరాబాద్ నగరానికి వందేభారత్ ట్రైన్లను కేటాయించారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్ లో తెలిపింది.

భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం..

ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపాదించినట్లు హైదరాబాద్- న్యూ ఢిల్లీ, కాచిగూడ- బెంగళూర్, సికింద్రాబాద్- ముంబైల మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా… ఈ బడ్జెట్ లో 400 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబై మధ్య జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. రానున్న రోజుల్లో హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే గంటల వ్యవధిలోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం వీలవుతుంది.