Tag Archives: what app

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..నగదు బదిలీకి సులువుగా ఇలా..!

Whatsapp: ఒకప్పుడు బ్యాంకు లావాదేవీలు అంటే పొద్దు పట్టేది. అలాంటిది ఇప్పుడు అరచేతిలోనే పనులు అయిపోతున్నాయి. యూపీఐ ద్వారా ఫోన్ పే, గుగూల్ పే, భీమ్ యాప్ ల ద్వారా క్షణాల్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..నగదు బదిలీకి సులువుగా ఇలా..!

దేశంలో నగదు లావాదేవీలను సులువు చేసింది. ప్రస్తుతం ఇండియాలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు బాగానే జరుగుతున్నాయి. ప్రపంచంలోనే నగదు రహిత లావాదేవీల్లో ముందుస్థానంలో భారత్ నిలుస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రతీ దుకాణాల్లో, ప్రతీ షాపింగ్ మాల్లో క్యూఆర్ కోడ్ లేకుండా వ్యాపారం జరగడం లేదు. 

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్..నగదు బదిలీకి సులువుగా ఇలా..!

ఇదిలా ఉంటే వాట్సాప్ కూడా ప్రస్తుతం నగదు లావాదేవీలు అందించే సేవలు ప్రారంభించనుంది. ఇన్నాళ్లు కేవలం మెసేజింగ్ ఫ్లాట్ ఫాం గా ఉన్న వాట్సాప్.. మనీ టాన్స్ఫర్ చేసే ఫీచర్ ను కూడా తీసుకువచ్చింది.

ఇక గుగూల్ పే, ఫోన్ ఫేలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఇందులో కొత్తగా కొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది వాట్సాప్. యూపీఐ పిన్ మార్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. 2020లో లాంచ్ చేసిన ఈ ఫీచర్ కు పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి అనుమతులు కూడా వచ్చాయి. మొత్తం 227 బ్యాంకులతో అనుసంధానమైన రియల్ టై పేమెంట్ సిస్టమ్ ను నడిపిస్తోంది. 

మరి యూపీఐ మార్చుకోవాలంటే.. ఇలా చేయాలి

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయండి.
 
కుడివైపు పైభాగంలోని ఆప్షన్లపై నొక్కి, పేమెంట్స్‌పై నొక్కండి.
 
పేమెంట్ సెక్షన్స్ కింద, మీరు UPI పిన్ నంబర్‌ను మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి.
 
ఆపై UPI పిన్ చేంజ్ ఆప్షన్‌పై నొక్కండి.
 
ఇప్పటికే ఉన్న UPI పిన్‌ని నమోదు చేసి, ఆపై కొత్త UPI పిన్‌ని నమోదు చేయండి. 
కొత్త UPI పిన్ నంబర్‌ని నిర్ధారించాలి.


యూపీఐ పిన్ మర్చిపోతే..

Forgot UPI పిన్‌పై నొక్కండి.
CONTINUE ఎంచుకుని, మీ డెబిట్ కార్డ్ నంబర్ యొక్క చివరి 6-అంకెలు మరియు చివరి తేదీని నమోదు చేయండి (కొన్ని బ్యాంకులు మీ CVV నంబర్‌ను కూడా అడగవచ్చు. దీని తర్వాత మీరు మీ UPI పిన్‌ని రీసెట్ చేసుకోవచ్చు.

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

Whatsapp Features: వాట్సాప్ మెసేజ్ గురించి తెలియని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వాట్సాప్ గురించి తెలిసే ఉటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ.. యూజర్ కు అత్యంత సులువుగా ఆపరేట్ చేసేందుకు చేస్తోంది. అయితే 2022లో కూడా సరికొత్త ఫీచర్లతో ఈ వాట్సాప్ మన ముందుకు రాబోతోంది. వాటి గురించి తెలుసుకుందాం

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

మొదటగా.. ఎవరైనా వాట్సాప్ ను పరిమినెంట్ గా తీసేయాలనుకుంటే కుదరదు. దానిలో కేవలం లాగ్ అవుట్ అనే ఆప్షన్ మాత్రమే కనపడునుంది. ఇక నుచి డిలీట్ మై అకౌంట్ అనే బటన్ కనపడకపోవచ్చు.
రీల్స్ అనేవి ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో చూస్తూ ఉన్నాం. ఇక నుంచి వాట్సాప్ లోనే డైరెక్ట్ గా రీల్స్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనిని ప్రత్యేకంగా ఓ ప్రత్యేక సెక్షన్ లాగా తీసుకురానున్నారు.

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

ఎవరైనా వాట్సాప్ చేసినప్పుడు ఇష్టం లేని సందర్భంలో వాటిని మనం ఆర్చీవ్ లో పెట్టేస్తాం. ఇక నుంచి దాని బుదలు ‘రీడ్ లేటర్’ అనే ఆప్షన్ ను తీసుకురానుంది. ఇన్సురెన్స్ లాంటి వాటిని కొనుగోలు చేసయాలంటే.. ప్రత్యేకంగా వేరే వెబ్ సైట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో నే ఆ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దీనిలో హెల్త్ తో పాటు.. పెన్షన్ స్కీమ్ లకు సంబంధించి వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

యూజర్ల భద్రత కోసం వాట్సాప్ మరో అడుగు ముందుకేసింది. చాట్ మెసేజ్ లే కాకుండా.. ఇక నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను కాల్స్, స్టేటస్ సెక్షన్లకు కూడా తీసుకురానున్నారు. కాంటాక్ట్స్ కార్డును మరింత అందంగా తీసుకురానున్నారు. లాస్ట్ సీన్ కు ఇక ముందు ఎక్కువ ఆప్షన్ తీసుకురానున్నారు. ఏ కాంటాక్ట్ అయినా.. మనం అనుమతి ఇస్తేనే చూసే విధంగా తీసుకురానున్నారు.


ఇంకా ఎన్నో రకాలు సౌకర్యాలు..

డిలీట్ చేసే సమయాన్ని పొడిగించనున్నారు. ఏదైనా మెసేజ్ ను తప్పుగా పంపినప్పుడు ఆవతలి వాళ్లు చూడకముందే.. డిలీట్ చేసేయాలి. లేదంటే.. డిలీట్ చేసినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అలా లేకుండా.. సమయాన్ని పొడిగించనున్నారు. ఇక గ్రూప్ లో ఎవరైనా అసభ్యకర పోస్టులు, వీడియోలు పెడితే.. ఎవరైతే దానిని పోస్టు చేశారో అతడే డిలీట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఉండదు.. ఆ అధికారం గ్రూప్ అడ్మిన్లకు కూడా కల్పించనున్నారు. ఇంకా బిజినెస్ కు సంబంధించిన.. మరికొన్ని స్టిక్కర్లు లాంటి ఆప్షన్లు తీసుకురానున్నారు.