Tag Archives: WhatsApp Video Calling

ఇకపై వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ లో.. వీడియో కాల్స్?

రోజురోజుకు సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది వాట్సాప్. ఒకప్పుడు కేవలం మెసేజ్ లు పంపుకునే స్థాయి నుంచి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఫార్వర్డ్ మెసేజ్ వంటి ఎన్నో ఆప్షన్లను యూజర్ల ముందుకు తీసుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం మొబైల్ ఫోన్ కి మాత్రమే పరిమితమైన ఈ యాప్ ఇకపై డెస్క్‌టాప్ మీద వాడుకొనే వీలు కల్పించింది.

కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో మీటింగులలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేనటువంటి వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్తతరహా యాప్స్ పుట్టుకు వచ్చాయి.

ఈ విధంగా ప్రస్తుతం అధిక డిమాండ్ ఏర్పడినటువంటి ఈ యాప్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా యూజర్లకు సరి కొత్త వెర్షన్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటివరకు కేవలం ఫోన్ కి మాత్రమే పరిమితమైన ఈ యాప్ ను ఇకపై డెస్క్‌టాప్ వర్షన్‌లో కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ ఆప్షన్ కేవలం విండోస్ 10 64-బిట్ వెర్షన్ 1903 లేదా కొత్త, మ్యాక్ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే వెబ్ వాట్సాప్ లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే కనుక అందుబాటులోకి వస్తే వెబ్ వాట్సాప్ కి అధిక డిమాండ్ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.