Tag Archives: work tress

అలసట, నీరసంతో బాధపడుతున్నారా… అయితే ఈ చిట్కాలు పాటించండి..!

సాధారణంగా మనం ఎంతో కష్టపడి పని చేసినప్పుడు లేదా పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు అలసటగా, ఎంతో నీరసంగా అనిపిస్తుంది. అయితే కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల అలసట నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం ఈ అలసట, నీరసం అనేది ప్రతిరోజు వేధిస్తున్న ఒక సమస్యగా మారుతుంది. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు వారి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. అయితే అలసట, నీరసం వంటి సమస్యలు కేవలం కొన్ని చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మన శరీరంలో ఏర్పడిన అలసట,నీరసం తగ్గాలంటే మన ఆహారంలో ఎక్కువ శాతం మాంసకృత్తులు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా తొందరగా అలసిపోయే వారు ఎక్కువగా మాంసాహారం లేదా మినుములు,చిక్కుడు గింజలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మాంసకృత్తులు అందుతాయి. అదే విధంగా ఎన్నో పోషకాలు కలిగిన పాలు, ఓట్స్, బాదం పప్పు వంటి వాటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణమే శక్తిని కలిగించి నీరసాన్ని పోగొడుతుంది.

అలసట నీరసం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువభాగం ద్రావణాలను తీసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడి అలసట, నీరసం తగ్గుతాయి. ముఖ్యంగా బయట లభించే చిరుతిండ్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లఅనేక రకాల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి వీలైనంత వరకు ఇలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.