Tag Archives: yellow fungus symptoms

యెల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ లకు తేడా ఏమిటో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు బ్లాక్ వైట్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కొన్ని వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా యెల్లో వైరస్ ప్రజలను మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నాడు.యెల్లో ఫంగస్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ తరహాలోనే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు.

యెల్లో ఫంగస్ ను మ్యూకర్ సెప్టిక్ అని అంటారు. అంటే శ్లేష్మం వల్ల ఏర్పడే చీము. వాస్తవానికి ఇది బల్లుల్లో ఏర్పడే సమస్య. బ్లాక్ ఫంగస్ తరహాలోనే యెల్లో ఫంగస్ కూడా కరోనా చికిత్సలో భాగంగానే ఏర్పడుతుంది. కరోనా చికిత్సలో ఎక్కువభాగం స్టెరాయిడ్స్ వాడటం, సురక్షితమైన నీటితో ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్లే వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ ఫంగస్ మన శరీరంలో ఏర్పడినప్పుడు ఆకలి లేకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, కళ్లు ఉబ్బినట్లు కనిపించడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. అదేవిధంగా కొందరిలో గాయాలు ఏర్పడి అవి ఎన్ని రోజులకు నయం కాకపోవడం, గాయాల నుంచి చీము ఏర్పడటం అవయవాల పనితీరు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనబడగానే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి.

యెల్లో ఫంగస్, బ్లాక్, వైట్ ఫంగస్‌లు పరిశుభ్రత మీదే ఆధారపడి ఉంటుంది. వైరస్ సోకిన రోగులు లేదా, వైరస్ లక్షణాలతో బాధపడే వ్యక్తులు పరిశుభ్రత పాటించకపోవటం వల్ల మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడినప్పుడు అందించే ఆక్సిజన్ సిలిండర్ లను పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఈ విధమైనటువంటి ఫంగస్ వ్యాప్తి చెందుతుందని,తక్కువ నిరోధక శక్తి కలిగి, బలహీనంగా ఉన్నవారిలో ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.