TDP leader Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేతగా 2014లో తొలిసారి ఎమ్మెల్యే గా పాయకరావుపేట నియోజకవర్గం నుండి గెలిచిన వంగలపూడి అనిత తొలుత టీటీడీ సభ్యురాలిగా పనిచేసారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ మహిళా నేత తానేటి వనిత చేతుల్లో ఓడిపోయిన అనిత ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మీడియా సమావేశాల్లోను, డిబేట్స్ లో పాల్గొంటూ వైసీపీ మీద విరుచుకుపడే అనిత ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె ఎక్కువగా వైసీపీ నేత రోజా మీద ఆమె విమర్శలను ఎక్కుపెడుతుండటానికి కారణాలను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

రోజా నాకేమైనా చుట్టమా…
అనిత గారు వైసీపీ లోని కొంతమంది నేతల మీద విరుచుకుపడుతూ విమర్శలను చేస్తుంటారు. అలా వైసీపీ లీడర్ మంత్రి అయిన రోజా మీద విమర్శలను ఎక్కువగా చేస్తుంటారు. రోజా కూడా ఎక్కువగా అనిత మీద విరుచుకుపాడుతుంటారు. ఇదే విషయం ఇంటర్వ్యూలో అడుగగా మీ మధ్య ఏదైనా పర్సనల్ గొడవ ఉందా అనే ప్రశ్న ఎదురు కాగా వంగలపూడి అనిత దానికి సమాధానం ఇస్తే అలాంటిదేమీ లేదని, రోజా నాకేం చుట్టం కాదు పక్కింటామే కాదు వ్యక్తిగతంగా గొడవ పడటానికి అంటూ చెప్పారు.

రోజా మాట్లాడే భాష తనకు నచ్చదని అందుకే ఎక్కువగా విమర్శిస్తుంటానంటూ చెప్పారు. రోజాకి నా భాష నచ్చదంటూ చెప్పారు. రాజకీయంగా పడే గొడవ కాస్తా వ్యక్తిగతం అయినట్లుంది అంటూ చెప్పారు. ఇద్దరూ అసెంబ్లీ లో ఒకసారి ఎదురుపడినా మొహాలు చూసుకోలేదు అంటూ చెప్పారు. ఫోనే చూసుకుంటూ పక్కకు ఇద్దరం వెళ్లిపోయామని, మాట్లాడుకోలేదు మొహాలు చూసుకోలేదని చెప్పారు.