టీడీపీకి మరో షాక్… మాజీ ఎమ్మెల్యే జేసీ, ఆయన కుమారుడు అశ్మిత్ రెడ్డి అరెస్ట్ !!

0
308

ఈఎస్ఐ కుంభకోనంలో మాజీ మంత్రి అచ్చన్నాయుడును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే తాడిపత్రి మాజి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జెసి అస్మిత్‌ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. వీరిద్దరినీ హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ లోని ఇంటిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారంలో వీరిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారులు జేసి ప్రభాకర్ రెడ్డి, అశ్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసారు. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు తెలిపారు. వీరిద్దరినీ హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. టిడీపి నాయకుల వరుస అరెస్టులు ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి.