లాక్డౌన్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి.!

0
318

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపద్యంలో ఇప్పటికే లాక్డౌన్, కర్ఫ్యూలు పాటిస్తున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల తీవ్ర పెరుగుతుండటం భయాందోళనకు గురించేస్తుంది. ఈ నేపధ్యంలో తెలంగాణ లో వీక్ ఎండ్ లో లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో తెలంగాణా ప్రభుత్వం ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి.

దీనిపై హోం మంత్రి మహమూద్ ఆలి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. లాక్డౌన్ అనేది చాలా మంది జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందన్నారు. అయితే అటు స్కూళ్ళ నిర్వహణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంతకీ మీరేమంటారు ? నైట్ కర్ఫ్యూ ఉండాలా ? వద్దా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here