Connect with us

Featured

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!

Published

on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.

Advertisement

ఎన్నో సందర్భాలలో దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ అడిగినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SS Thaman) రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన వరుస ఈవెంట్స్ జరుగుతాయని అభిమానులు రెడీగా ఉండాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చేవారమే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుంది అంటూ ఈయన వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు(Dil Raju) క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని చెప్పిన తేదీ మాత్రం చెప్పలేదు. కానీ తమన్ మాత్రం 20వ తేదీ విడుదల కాబోతుందని చెప్పకనే చెప్పారు అయితే ఈ విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు…అదే ప్రధాన కారణమా?

Published

on

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు టైం చాలా బాడ్ గా నడుస్తుందని చెప్పాలి. ఈయన కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జైలు పాలు అయ్యారు. ఇక నేషనల్ అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్ అవార్డు అందుకోవడం కోసం బెయిల్ ఇవ్వాలని కోర్టులో తన భార్య పిటీషన్ ఇచ్చారు..

Advertisement

మరి కాసేపట్లో ఈయన జైలు నుంచి బయటకు వస్తారన్న నేపథ్యంలో నేషనల్ అవార్డు కమిటీ తనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈయన బెయిల్ కూడా రద్దు అయ్యింది.మళ్ళీ వెంటనే బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేయగా కేసు విచారణలో ఉన్న దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.

ఈయనపై లైంగిక ఆరోపణలు అలాగే అత్యాచార కేసులు నమోదు కావడంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిందని తెలుస్తోంది. మరోవైపు ఈయనకు బెయిల్ రాకపోవడమే కాకుండా తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఈమెకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.

బెయిల్ రద్దు..
ఇలా జానీ మాస్టర్ కు వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరమైన విషయాలలో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో అభిమానులు కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసు జానీ మాస్టర్ కెరియర్ పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం బెయిల్ పిటీషన్ కొట్టి వేసిన కోర్ట్ ఈయనకు ఎప్పుడు బెయిల్ మంజూరు చేస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!

Published

on

Adimulam:సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఆయన తిరుపతిలో ఒక లాడ్జ్ లో తనపై అత్యాచారం చేశారు అంటూ ఓ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో ఈయన పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

Advertisement

ఇలా ఈ ఘటన మర్చిపోకముందే ఈయనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిమూలం వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదని ఈయన మరో మహిళతో అసభ్యకరంగా ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి ఆడియో లీక్ అవ్వడంతో మరోసారి వార్తలలో నిలిచారు.

ఈ వీడియోలో ఆదిమూలం మహిళతో.. నువ్వు అందంగా ఉన్నావు.. పర్సనాలీటీ బాగా పెరిగిపోయింది. కలర్ గా బాగా పెరిగింది.. అప్పటికి ఇప్పటికి బ్యూటీఫుల్ గా అయిపోయావ్.. అంటూ మాట్లాడారు. అద్భుతంగా తయారైపోయావ్.అలా చేస్తే బాడీ అంతా రిలాక్స్ గా హ్యాపీగా ఉంటుందని.. నీకు ఏం తెలుసని.. బూతులు మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ప్రస్తుతం సొషల్ మీడియాలో రచ్చగా మారింది.
తలలు పట్టుకుంటున్న నేతలు..
ఇలా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీడియోలు వరుసగా బయటకు రావడంతో ఇతర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. మరోవైపు వైకాపా నాయకులు ఈ వీడియోని వైరల్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఈయన వ్యవహార శైలిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

https://x.com/UttarandhraNow/status/1845730879186059365?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1845730879186059365%7Ctwgr%5Ef3a4317003765b74a967c68a526fc063c052e84d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fzeenewstelugu-epaper-dh9cfa441265e44dc6946fe7674729ec1c%2Fadimulamsupargaunnavmaromahilatorechhipoyinaaadimulanaadiyovairal-newsid-n634969815

Advertisement
Continue Reading

Featured

Elections 2024: ఈవీఎం ఎన్నికలు అయితే పోటీ చేయను.. వైకాపా మాజీ ఎమ్మెల్యే కామెంట్స్!

Published

on

Elections 2024: ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఎన్నో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఏదో తప్పు జరిగిందని ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ అయ్యాయి అంటూ కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు.

Advertisement

ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగితే తాము ఎన్నికలలో పోటీ చేయమని పలువురు వైకాపా మాజీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన స్టేట్మెంట్ అందించారు.

2024 లో జరగబోయే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు జరిగితే తాను ఎన్నికలలో పోటీ చేయనని ఈయన తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు అండ్ బ్యాచ్ మరోసారి మోసానికి పాల్పడుతుందని అలాంటప్పుడు పోటీ చేసిన ప్రయోజనం ఉండదని రాచమల్లు తెలిపారు.

ఈవీఎం ట్యాంపరింగ్..
ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ పలు ప్రాంతాలలో పోలైన ఓట్ల అసమానతులను చూపిస్తూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తే మరోసారి మోసమే జరుగుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!