ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేశారు.. ఆ రోజు రాత్రి అలా జరగటంతో నా కడుపు మండిపోయింది: మురళీమోహన్

0
12771

తెలుగు సినీ నటుడు, రాజకీయ నేత మురళీమోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వ్యక్తి. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తున్నారు. దాదాపు 350 సినిమాలలో నటించారు. ఈయన 2015 వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు.

ఈయన తెలుగుదేశం తరపున రాజమండ్రి నియోజకవర్గం నుండి 2014 లోక్ సభలో ఎన్నికయ్యారు. సొంతంగా జయభేరి అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి పలు కీలక విషయాలు తెలిపారు.

తమ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారని కానీ ఎన్టీఆర్ మాత్రం తమకు అభిమాన నాయకుడని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఎన్టీఆర్ ఎంతో శక్తివంతురాలైనా ఇందిరాగాంధీని ఎదిరించి మరీ గెలిచారని తెలిపారు. ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లి ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చిన రోజున 50, 60 మంది సినిమా ప్రముఖులతో పాటు ఎంతోమంది అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఎదురు చూశామని తెలిపారు.

ఇక ఎన్టీఆర్ అందర్నీ చూసి చాలా సంతోషపడ్డారని తమ దగ్గరికి వచ్చి పలకరించారని తెలిపారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఓ రోజు రాత్రి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ అందరితో కాసేపు సరదాగా మాట్లాడుకున్నారని తెలిపారు. ఆరోజు రాత్రి 11 గంటల వరకు అలా జరిగిందని ఇక హోటల్ కు వెళ్లి పడుకున్నామని తెలిపారు. మరుసటి రోజు ఉదయాన్నే మద్రాస్ కు వెళ్లాక రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి మాట్లాడుకున్నామని అప్పుడు రామారావు గారు అసలు విషయం చెప్పారని తెలిపాడు. ఆ విషయం చెప్పడంతో తనకు కడుపు మండిపోయిందట. నటులు కంటే గొప్పగా రాజకీయ నాయకులు నటిస్తున్నారని రాత్రి ఏమి తెలియని వారిగా అందరితో బాగా ఉన్నాడని తెల్లారేసరికి తనను ముఖ్యమంత్రిగా దించేసారని చెప్పడంతో కడుపు మండిందని తెలిపారు. ఇక వెంటనే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మొత్తం ప్రచారం చేశామని తెలిపారు. ఆ తరువాత నెల రోజులకే ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని తెలిపారు మురళీమోహన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here