Connect with us

Featured

Tirupathi Laddu: తిరుపతి లడ్డులో పొగాకు… ఆందోళనలో శ్రీవారి భక్తులు!

Published

on

Tirupathi Laddu: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతిలో ఇటీవల పెద్ద ఎత్తున అపశృతి చోటు చేసుకుంటూ వస్తోంది. తిరుపతి లడ్డు విషయంలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉండగా గత ప్రభుత్వం అవన్నీ అవాస్తవాలేనని నిజా నిజాలు బయటపెట్టాలి అంటూ చాలెంజ్ చేస్తున్నారు.

Advertisement

ఇలా తిరుపతి లడ్డు విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అయితే ఇందులో ఏది నిజం అనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఏది ఏమైనా స్వామివారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందనే విషయం హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెప్పాలి. ఇలా నెయ్యి తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన నూనె ఉపయోగిస్తున్నారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు.

గత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ విచారణ జరిపించాలని కోరుతున్నారు. అయితే ఈ కల్తీ గురించి మరవకముందే మరోసారి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లాలోని ఓ కుటుంబ సభ్యులు ఇటీవల స్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం తిరుపతి వెళ్లారు అక్కడ స్వామివారి దర్శనం అనంతరం స్వామి వారి ప్రసాదంగా లడ్డూలను విక్రయించారు.

లడ్డులో పొగాకు..
ఇంటికి వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచాలని చూడగా అందులో పొగాకు పొట్లం కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ నెయ్యి ఘటన మరవకముందే మరోసారి ఇలా పొగాకు కనిపించడంతో ఈ తప్పిదం ఎవరిది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వంపై వైకాపా అభిమానులు దాడి చేస్తున్నారు. మరి ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jabardasth: తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షోగా జబర్దస్త్.. ఇప్పుడు మరింత ఉత్సాహంతో!

Published

on

Jabardasth: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని కడుపుబ్బా నవ్విస్తూ వస్తోంది. ప్రతి శుక్రవారం శనివారాలలో సక్సెస్ఫుల్ గా ప్రసారం అవుతూ దూసుకుపోతోంది. షో మొదలైనప్పటి నుంచి ఎంతోమంది జడ్జిలు, యాంకర్లు, కమెడియన్లు మారినప్పటికీ అందులో కామెడీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. చక్కగా జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. వందలాదిమంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చింది.

Advertisement

అంతేకాకుండా ఎంతోమంది మంచి మంచి కమెడియన్ లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతేకాకుండా తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ ను క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జబర్దస్త్ షో. ఈ షో కంటే ముందు, ఈ షో తర్వాత ఎన్నో రకాల షోలు తెలుగు బుల్లితెరపై వచ్చినప్పటికీ ఈ షో ని మాత్రం ఏవీ బీట్ చేయలేకపోయాయి. 2013లో ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు దాదాపుగా 60 ఎపిసోడ్ లకు పైగా పూర్తి చేసుకుంది. అయితే దాదాపు ఈ షో మొదలయ్యి పదేళ్లు దాటినా కూడా ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడంతో పాటు తాజా కంటెంట్ ను క్రియేటివ్ కంటెంట్ ని ఇస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది.

అంతేకాకుండా నెంబ‌ర్ వ‌న్ కామెడీ షోగా నవ్వుల పువ్వుల‌ను పూయిస్తోంది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లు ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తున్నారు.. కొందరు హీరోలుగా రాణిస్తుండగా మరికొందరు దర్శకులుగా కమెడియన్లుగా కూడా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను, ష‌క‌ల‌క శంక‌ర్ వంటివారు సాఫ్ట్ వేర్‌ సుధీర్‌, 3 మంకీస్‌, గాలోడు, రాజు యాద‌వ్‌, ధ‌ర్మ‌స్థ‌లి వంటి చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. బ‌లగం వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో వేణు వంటి వారు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు.

నెంబర్ వన్ షో..

Advertisement

ధ‌న‌ధ‌న్ ధ‌న‌రాజ్‌ వంటివారు కూడా రామం రాఘ‌వం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి విదితమే. ఇలా బ‌జ‌ర్ద‌స్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో త‌న మార్క్‌ను క్రియేట్ చేసి ప్ర‌భావాన్ని చూపుతోంది. ఇప్పుడు మరి కొంతమంది కొత్త కొత్త కమెడియన్ లు జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. ఎంతమంది కమెడియన్లు ఎంట్రీ చిన్నప్పటికి ఈ షో మాత్రం నెంబర్ వన్ షో గానే రాణిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం టాప్ కామెడీ షో గా రాణిస్తూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది జబర్దస్త్ షో.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ వ్యవహార శైలి మెగా కుటుంబానికి నచ్చలేదా.. అందుకే అలా ఉన్నారా?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అయితే తిరుపతి లడ్డు కల్తీ వివాదంలో భాగంగా ఈయన ప్రాయశ్చిత్త దీక్ష వేశారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంతో చాలావరకు విమర్శలే వస్తున్నాయి. తప్పు చేసిన వారు మాత్రమే ప్రాయశ్చిత్తం కోరుకుంటారు.

Advertisement

స్వామివారి లడ్డు విషయంలో ఎలాంటి కల్తీ జరగలేదు కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఇలాంటి ఒక తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు అందుకే ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని వైకాపా నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులలో ఉన్న లేదా ఆయన చేసే ఏ కార్యక్రమం పై అయినా కూడా మెగా కుటుంబం మద్దతు పూర్తిగా లభిస్తుంది.

పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని విషయాలలో కూడా మెగా కుటుంబ సభ్యుల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారి మద్దతు తెలుపుతూ ఉంటారు. మరి ఇప్పుడు మాత్రం తిరుపతి లడ్డు వ్యవహారంలో మెగా కుటుంబం మౌనం పాటిస్తున్నారు. ఇలా మెగా కుటుంబం మౌనం ఉండటానికి కారణం పవన్ వ్యవహార శైలి నచ్చక పోవడమే అని తెలుస్తుంది.

క్రిస్టియన్ అమ్మాయితో పెళ్లి..
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాణాలైనా వదులుకుంటాను అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెబుతున్నారు. కానీ ఆయన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు అంటూ పలువురు వైకాపా నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇలా పవన్ వ్యవహార శైలి మెగా కుటుంబానికి నచ్చకపోవటం వల్లే మెగా కుటుంబం మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

YS Jagan Mohan Reddy: డిక్లరేషన్ ఇస్తేనే జగన్ కు శ్రీవారి దర్శనం.. జగన్ కి షాక్ ఇచ్చిన బాబు!

Published

on

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు బయలుదేరుతున్న సంగతి మనకు తెలిసిందే. తిరుమలలో లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయటంతో వైకాపా ఘాటుగా స్పందించారు. తమ హయామంలో ఎలాంటి కల్తీ జరగలేదని అలా కనుక నిరూపితం చేస్తే తాము ఎలాంటి శిక్ష అనుభవించడానికి అయినా సిద్ధమేనని వైకాపా నాయకులు సమాధానం ఇచ్చారు.

Advertisement

ఇకపోతే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఇలాంటి ఆరోపణలు రావడంతో సాక్షాత్తు తిరుమల ఆలయానికి వెళ్లి ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేయడంతో ఈ విషయం కాస్త కీలక మలుపు తిరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏకంగా కేంద్రానికి కూడా లేఖ రాశారు. ఇదంతా కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ఆ హామీలన్నింటిని తప్పుదోవ పట్టించడం కోసమే ఇలా స్వామివారిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఇలా వాళ్ళు తప్పు చేయడంతో ఆ తప్పును పరిష్కరించడం కోసం ఈ నెల 28వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాకుండా 28వ తేదీ ఈయన స్వయంగా కొండపైకి మెట్ల మార్గాన వెళ్లి స్వామి వారిని దర్శించుకోబోతున్నట్లు తెలియజేశారు..

డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా..
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తున్నారనే విషయం తెలియడంతో కూటమి ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తిరుమల స్వామివారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆయన స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటూ నిబంధనలు పెడుతున్నారు. ఇలా బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!