స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న గజాల ఎందుకు ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది.?

0
2167

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి గజాల. 2001 సంవత్సరంలో తన మొదటి సినిమా చేసింది గజాల. అతి తక్కువ కాలంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈవిడ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో తనని మోసం చేశారన్న కారణంతో ప్రాణత్యాగానికి పాల్పడి చావు దరిదాపుల్లో వరకు వెళ్లి వచ్చింది ఈ నటి. ఆ సమయంలో యాక్షన్ హీరో అర్జున్ సహాయం చేయకపోయి ఉంటే ఇప్పటికి గజాల స్వర్గస్తురాలు అయి ఉండేది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత గజాల మళ్లీ హైదరాబాదులో ఎక్కడ కనిపించలేదు.

అయితే కొన్ని రోజులు మాత్రం అసలు గజాల ఉందా…? అసలు ఆమె ఏమి అయింది అన్న ఆలోచనలో పడిపోయారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ లో “నాలో ఉన్న ప్రేమ” సినిమాతో రంగప్రవేశం చేసిన గజాల జూనియర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ 1” సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది. అంతే కాదు ఆ సినిమాతో స్టార్ డం అందుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో “కలుసుకోవాలని” సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత వరుసగా ఓ చిన్నదాన, అల్లరి రాముడు, తొట్టి గ్యాంగ్ ఇలా కొన్ని వరుస సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది గజాల. ఆమె మే 19, 1985 లో ముంబైలో జన్మించింది. గజాల ఫ్యామిలీ మొత్తం కువైట్ లో స్థిరపడింది. తనకు సినిమా పట్ల ఉన్న ఆసక్తితో ఆవిడ ఒక్కటి భారతదేశంలో ఉండే ఈ సినిమాలో నటించడం సాగింది.

ఇక తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆమె 2002 సంవత్సరంలో జులై 22న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రశాంత్ కుటీర్ గెస్ట్హౌస్ లో నిద్ర మాత్రలు మింగింది. ఇక ఆ సమయంలో హీరో అర్జున్ కి ఫోన్ చేసి ‘ఇకపై నేను మీకు కనిపించాను’ అంటూ ధీనంగా చెప్పింది. దాంతో అప్పటికప్పుడు అర్జున్ వచ్చి గజలాను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ విషయంపై అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. అయితే గజాలా ఇలా బలవాన్మరనానికి కారణాలు బయటకు రాలేదు గానీ ఆ సమయంలో గజాలాను ఆసుపత్రికి తీసుకువెళ్ళిన అర్జున్ కారణంగానే ఆమె అలా అయిపొయింది అంటూ అనేక రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై అర్జున్ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలు సద్దుమణిగాయి.

అయితే ఆ తరువాత హైదరాబాదు నుంచి ముంబైకి వెళ్లి పోయిన ఆమె అక్కడ టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమకు దారి తీసింది. అలా వారిద్దరూ నాలుగేళ్ళు ప్రేమ కొనసాగించిన తర్వాత 2016 సంవత్సరంలో గజాల పెళ్లి చేసుకుంది. అయితే ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆమె భర్త డైరెక్షన్ లో కొన్ని టీవీ సీరియల్స్ చేయాలని అనుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here