‘అరణ్య’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!!

0
466

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం అరణ్య.. మార్చి 26 అనగా ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం…

కథ విషయానికొస్తే ;

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా) కి ప్రకృతి అంటే చాలా ఇష్టం.. వల్ల తాతలు ప్రభుత్వానికి 500 ఎకరాలు రాసిచ్చేస్తే..మన అరణ్య ఆ అడవికి, అక్కడి జంతువులకు రక్షకుడిగా ఉంటాడు.. అంతేకాదు ప్రకృతి ప్రేమికుడిగా లక్ష మొక్కలు నాటి.. రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంటారడు.. అయితే అక్కడి అటవీ శాఖ మంత్రి రాజగోపాలం (అనంత్ మహదేవన్)కి ఆ అడవిలోని స్థలంపై కన్ను పడుతుంది.. అక్కడ ఒక టౌన్ షిప్ ని కట్టాలని అనుకుంటాడు… దానికోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలని అనుకుంటాడు రాజగోపాలం.. దాన్ని మన అరణ్య ఎలా అడ్డుకున్నాడు.? తన ప్రాజెక్ట్ కి అడ్డుపడిన అరణ్య ను మంత్రి ఏ విధంగా హింసించాడు? చివరికి అడవిని, ఏనుగులని అరణ్య ఎలా రక్షించాడు?అనేదే కథ..

ఇక విశ్లేషణ విషయానికొస్తే;

గతంలో ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సల్మాన్.. అరణ్య సినిమాతో అంచనాలను అదుకోలేకపోయాడనే చెప్పాలి.. సినిమాలో కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించిన విధానం బాగోలేదు.. మంచి బలమైన కథను తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.. సినిమాలో పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా. ఆ తర్వాత కథ, కథనాన్ని అర్థం లేకుండా ఏటో తీసుకెళ్లాడు.. కథలో అసలు నక్సలైట్లు ఎందుకు వచ్చారో అర్ధం కాదు.. మళ్ళీ అందులో మావోయిస్టుతో సింగ ప్రేమ కథ కూడా అంతా ఇంట్రెస్ట్ గా అనిపించదు.. ఇంత బలమైన కథలు ఎలాటి ట్విస్టులు లేకుండా సింపుల్ గా సాగిపోతుంది ఈ సినిమా..ఇక సినిమాలో మెయిన్ హైలైట్ విజువల్ ఎఫెక్ట్.. సినిమా నేపథ్యం అంతా అడవి చుట్టే తిరుగుతుంది.. షూటింగ్ కూడా ఎక్కువ శాతం అడవిలోనే జరిగింది.. ఇక అడవి యొక్క అందాలను స్క్రీన్ పై చాలా బాగా చూపించారు.. సినిమాటోగ్రఫీ ఏ ఆర్ అశోక్ పనితనం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.. ఇక సినిమాకు మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం.. మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మెయిత్రా కొన్ని సీన్లకు తన బీజీఏం తో ప్రాణం పోశాడనే చెప్పాలి.. ఎడిటింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉడాల్సింది.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఇక మొత్తంగా సినిమా రివ్యూ ;

ప్లస్ పాయింట్స్ :
రానా నటన
స్టోరీ
విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
సాగదీత సీన్లు

ఇక ఫైనల్ గా ఈ సినిమాకి తెలుగుడెస్క్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here