Featured

యజ్ఞం సినిమాకు ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా?

పోకూరి బాబూరావు నిర్మాతగా ఈతరం ఫిలింస్ బ్యానర్ పై రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం “యజ్ఞం” ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ మాస్ లుక్ ఇతనికి మంచి పేరు తెచ్చిదని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నారు హీరో గోపీచంద్.

టి.కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోపీచంద్ మొట్టమొదటిసారిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన “తొలివలపు” చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తరువాత జయం, వర్షం సినిమాలలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పోకూరి బాబురావు నిర్మాణంలో ఏ ఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్లో యజ్ఞం సినిమా కథ సిద్ధమవుతోంది.

ఈ కథనం మొత్తం రాసిన తర్వాత ముందుగా ఈ సినిమాను హీరో ప్రభాస్ తో తీయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ కథతో నిర్మాత పోకూరి బాబు రావు ప్రభాస్ తండ్రినీ కలిసి ఆయనకు యజ్ఞం సినిమా కథను వినిపించారు. ఈ సినిమా కథ అతనికి నచ్చడంతో వెంటనే ప్రభాస్ హీరోగా ఈ సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రవికుమార్ చౌదరిని కాకుండా బి.గోపాల్ తో ఈ సినిమా చేద్దామని భావించారు. అలా దర్శకుడిని మార్చాలనడంతో ఈ సినిమా ప్రభాస్ నుంచి గోపీచంద్ కు వెళ్ళింది.

కథపై, దర్శకుడి పై నమ్మకం ఉండటంతో హీరో గోపీచంద్ ని తీసుకొని ఈ సినిమా నిర్మింద్దామని పోకూరి బాబూరావు చెప్పారు. అలా ఈ సినిమా ప్రభాస్ ని కాదని గోపీచంద్ ను వవరించింది. ఈ క్రమంలోనే ఈ తరం ఫిలిం బ్యానర్ పై పోకూరి బాబూరావు నిర్మాతగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని గోపీచంద్ కు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

4 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

4 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

4 hours ago