తెరపైన వారి నటనతో, డైలాగులు, డాన్స్ లు చేసి మనల్ని ఆకట్టుకుంటారు మన సినిమా హీరో హీరోయిన్స్… ఇదంతా కేవలం సినితెర మీద మాత్రమే. అవి మనకు నచ్చితే వారిని పిచ్చిగా అభిమనిస్తాం. ఇక నిజ జీవితంలో వచ్చేసరికి వారు చేసే కొన్ని పనుల వల్ల జనాల్లో వారిపై కొంత అవిశ్వాసం ఏర్పడుతుంది. వారి గురించి ఒక్కో మీడియా ఒక్కోలా ఆ హీరోయిన్ కి ఈ హీరోతో ఎఫైర్ ఉంది, ఈ హీరోకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ చాలా పనికిమాలిన వార్తలు వస్తుంటాయి. ఇకపోతే, అందులో వాస్తవం కొంతవరకే అయినా, కొందరు సినీ సెలబ్రిటీలు ఒకసారి పెళ్లయ్యాక మళ్ళీ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు..

అప్పటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరనుంచి నిన్న పెళ్లి చేసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు వరకు చాలా మందే ఉన్నారు. అయితే ఒకసారి మన టాలీవుడ్ లో వారెవరో చూద్దామా.. !

మొదటగా టాలీవుడ్ లో చెప్పుకోతగ్గది సీనియర్ ఎన్టీఆర్. మన తెలుగు సినిమా తొలి తరంలో సూపర్‌ స్టార్ అంటే నందమూరి తారక రామారావు. ఇక 1942 సంవత్సరంలో తన మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆమె క్యాన్సర్ ‌తో మరణించడంతో ఒంటరైన రామారావు చివరి దశలో 1993 సంవత్సరంలో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు ఆయన.

ఇక అలాగే మరో సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1961 సంవత్సరంలో ఇందిరాదేవిని వివాహంచేసుకున్న కృష్ణ, 1969 సంవత్సరంలో తన సహనటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇక అలాగే సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా రెండు పెళ్లిళ్ల విషయంలో తండ్రి ఎన్టీఆర్ ‌నే అనుసరించాడు. 1973 సంవత్సరంలో లక్ష్మీని పెళ్లి చేసుకున్న, అనంతర కొన్ని పరిణామాలతో హరికృష్ణ షాలినిని వివాహం చేసుకున్నారు.

ఇక వీరివరుసలోని మరికొందరు కూడా రెండు పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, కృష్ణం రాజు, మంచు లక్ష్మి, కీర్తి రెడ్డి, శరత్ బాబు, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, తాజాగా దిల్ రాజు వీరందరూ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నవారే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here