కొత్తకారు కొనేవాళ్లకు గుడ్ న్యూస్.. లక్షకు కేవలం రూ.2,000 ఈఎంఐ!

సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన చాలామంది కారును కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. సులభ వాయిదాలలో తక్కువ మొత్తం చెల్లించి కారును కొనుగోలు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లకు బ్యాంకులు శుభవార్త చెబుతున్నాయి. తక్కువ వడ్డీకే కార్ లోన్లను అందిస్తూ కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు బ్యాంకులు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి.

అయితే కారు లోన్ తీసుకునే కస్టమర్లు తప్పనిసరిగా రుణ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటి గురించి ప్రాథమిక అవగాహనను కలిగి ఉండాలి. తక్కువ వడ్డీ రేట్లకే కారును కొనుగోలు చేయడం ద్వారా ఈఎంఐల భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ 7.9 శాతం వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంక్ లో లక్ష రూపాయలు రుణం తీసుకుంటే 2,000 రూపాయల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.7 శాతం నుంచి కార్ లోన్లను ఆఫర్ చేస్తోంది. మరో బ్యాంకు యూకో సైతం కారు లోన్ తీసుకునే వారికి 7.7 శాతం వడ్డీ చొప్పున వసూలు చేస్తోంది. ఇండియన్ బ్యాంక్‌ 7.65 శాతం వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తుండగా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర 7.45 శాతం వడ్డీరేటును వసూలు చేస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కు్ మాత్రం 7.55 శాతం చొప్పున కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్లపై 7.15 శాతం చొప్పున వడ్డీ రేట్లను వసూలు చేస్తుండగా కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.3 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం కారు లోన్లకు 7.35 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం 6.85 శాతం వడ్డీకే కారు లోన్ ను అందిస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌ కూడా ఇదే స్థాయిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి.