రోడ్డు ప్రమాదాలు గురించి ఎంతగా అవగాహన కల్పించినా కూడా ఇప్పటికీ కొంతమంది వాటిని పట్టించుకోవడం లేదు. తరచూ నియమాలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తాన్ని తన ద్విచాక్రవాహనంపై దర్జాగా తీసుకువెళ్తూ పోలీసుల తనిఖీలలో దొరికిపోయాడు.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ కి చెందిన వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తాన్ని (7 మంది) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసు తనిఖీలలో భాగంగా కానిస్టేబుల్ మల్లేశం వారిని అడ్డుకున్నాడు. “అయ్యా.. నీకో దండం.. ఇది బైకా లేదా ఎడ్ల బండనుకున్నావా?” అంటూ అతనికి రూ.1,200 ఫైన్ విధించి పంపించడం జరిగింది.