అబ్బనీ తీయని దెబ్బ పాట మధ్యలో సుందరం మాస్టర్ ఎందుకు లేచి వెళ్లిపోయారు..?

0
905

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలువబడే డాన్స్ డైరెక్టర్ ప్రభుదేవా తండ్రి గారే సుందరం మాస్టర్.కర్ణాటక రాష్ట్రంలో మురుగు అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన సుందరం మాస్టర్ వాహిని స్టూడియో అధినేత లైన బి.యన్.రెడ్డి, చక్రపాణి స్టూడియో కు అనుబంధంగా చందమామ ప్రెస్ క్లబ్ నడిపేవారు.అందులో వీలర్ గా సుందరం మాస్టర్ 40 రూపాయల నెల జీతానికి చేరాడు.వీలర్ గా పనిచేస్తున్న కూడా సుందరం మాస్టర్ ధ్యాస డాన్స్ పైనే ఉండేది సినిమా స్టూడియోలో వచ్చే మ్యూజిక్ శబ్దాలకు సుందరం మాస్టర్ తన కాలు కలిపేవాడు.అలా తనకున్న డాన్స్ ఇంట్రెస్ట్ తో నెల జీతం లో నుండి 10 రూపాయలు చెల్లించి డాన్స్ నేర్చుకునేవాడు.

శాంతారామ్,గోపి కృష్ణ,ఉదయ శంకర్ లాంటి నృత్య దర్శకులకు సుందరం మాస్టర్ ఏకలవ్య శిష్యుడు.ఒక పేపర్లో డాన్సర్స్ కావాలని యాడ్ చూసిన తన మిత్రులు ప్రోత్సహించడంతో డాన్స్ పర్ఫామెన్స్ టెస్ట్ లో రెండవ వాడిగా రాణించడం జరిగింది.గ్రూప్ డాన్సర్ గా ఒక తమిళ సినిమాకు చేరాడు.ఆ తరువాత తంగప్పన్ మాస్టర్ దగ్గర నాలుగు సంవత్సరాలు అసిస్టెంట్ గా చేశాడు సుందరం మాస్టర్ ను గమనించిన కె.బాలచందర్ తన డైరెక్షన్ లో వచ్చిన “మీరు కుమిలి”సినిమాకు నృత్య దర్శకుడిగా పరిచయమయ్యాడు.అలా ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి,శ్రీదేవి, బాలకృష్ణ లాంటి హీరో, హీరోయిన్ లకు నృత్యాలను సమకూర్చారు.

తన కుమారులైన ప్రభుదేవ,రాజు సుందరం,నాగేంద్ర ప్రసాద్ లకు శాస్త్రీయ పద్ధతిలో డాన్స్ నేర్పించడం జరిగింది… ప్రభుదేవ,రాజు సుందరం మాస్టర్ లు తెలుగు,తమిళ ఇతర భాషల్లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు గాను “అబ్బనీ తీయని దెబ్బ”అనే పాటకు నృత్యాలు సమకూరుస్తున్న సమయంలో సుందరం మాస్టర్ కు అత్యవసరమైన పని పడడంతో మిగతా కొద్ది భాగం తన కొడుకైనా ప్రభుదేవా మాస్టర్ కి అప్పగించడం జరిగింది. దర్శకుడు రాఘవేంద్ర రావు మరియు ప్రభుదేవా మాస్టర్ ఇద్దరు కలిసి ఆ పాటను పూర్తి చేయడంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది.