Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

Lesbian Love: ఈ మధ్య కాలంలో మనదేశంలోనూ అమ్మాయి-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిలు, స్వలింగ సంపర్కుల వివాహాలు పెరుగుతున్నాయి. ఇప్పటికి వరకు విదేశాల్లోనే ఉన్న ఈ పోకడలు దేశంలోనూ పెరుగుతున్నాయి. ఇలాంటి అరుదైన ఘటన ఇటీవల జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!
Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

మేజర్లయిన ఇద్దరు యువతులు తాము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని ఇంట్లో నుంచి పారిపోయారు. సమీపంలోని ఓ గుడికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి తాము జీవితాంతం కలిసి ఉంటామని, మాకు రక్షణ కావాలని కోరారు. పోలీసులు వారివురి పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో పంపించారు.

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

జార్ఖండ్ రాష్ర్టం ధన్ బాద్ జిల్లా జోరఖ్​పుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జామాడోబాలో రాఖి మిర్ధా(24), కరిష్మా రావత్​(23) అనే ఇద్దరు యువతులు నివాసముంటున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీరించరని భావించి ఆదివారం ఇంటి నుంచి పారిపోయారు.

వారికి దగ్గర్లోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం జోరఖ్ పుర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము జీవింతాంతం కలిసి ఉంటామని చెప్పారు. పోలీసులు వారి పెద్దలను పిలిపించారు. వారి తమ కూతుళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. చివరికి వారిని ఎలాగోలా ఒప్పించి ఇళ్లకు తీసుకెళ్లారు.

కానీ ఆర్టికల్ 15 ప్రకారం…

ఇటీవల ధన్ బాద్ ప్రాంతంలో ఇలాంటి వివాహాలు ఎక్కువయ్యాయి. మన దేశంలో లెస్బియన్, స్వలింగ సంపర్కులు, ఒకే లింగం కలిగిన వారి వివాహాలకు చట్టబద్ధత లేదు. కానీ ఆర్టికల్ 15 ప్రకారం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఉండేలా రక్షణ ఉంది. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే వారి సంక్షేమానికి, వారు జీవించేందుకు అవసరమైన రక్షణను 2019 చట్టం ప్రకారం కల్పిస్తుంది.