టీటీఈ అవతారమెత్తిన దొంగ.. చివరికి అలా పట్టుబడ్డాడు?

రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎవరి సామాన్లకు వారే బాద్యులు అంటూ ప్రకటనలు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ రైల్వే స్టేషన్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఆ స్టేషన్ లోనే టిఫిన్ చేసేందుకు పక్కనే ఉన్న నల్లా వద్ద చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు.

తన వద్ద ఉన్న బ్యాగ్ ను పక్కన ఉన్న ఓ టేబుల్ వద్ద ఉంచాడు. చేతులు శుభ్రం చేసుకొని వచ్చే సరికి అతడి బ్యాగ్ మాయం అయిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. ఆ బ్యాగ్‌లో తన యూనీఫామ్, చలాన్ల బుక్ ఉన్నాయి అని ఆ టీటీఈ చెప్పాడు. అవి తనకు ఎంతో ఉపయోగం అంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అనుకున్నట్లుగానే ఆ బ్యాగ్ ను ఓ దొంగ పిల్లిలాగా వచ్చి దొంగిలించాడు.

అతడు ధరించిన డ్రస్ కలర్ ఆధారంగా అతడు ఎటు వైపు వెళ్లాడో ఆ సీసీ కెమెరాలను చెక్ చేశారు. చివరకు అతడు రైలు ఎక్కి వెళ్లిపోయినట్లు సీసీటీవీలో కనపడింది. ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది అనేది కనుకున్నారు. అది హౌరా-అమృత్‌సర్ పంజాబ్ మెయిల్ ట్రైన్ ఎక్కాడు. అతడి పేరు గోవింద్ సింగ్. రైల్లో ఆ నల్లకోటు ధరించి టికెట్ అడుగుతూ.. టికెట్ లేని ప్రయాణికుల్ని బెదిరిస్తూ డబ్బు లాక్కుంటున్నాడు. ఆ పనిలో ఉండగా ఆ రైల్లో ఉండే మరో టీటీఈ ఎదురయ్యాడు.

ఎందుకు నా పని నువ్వు చేస్తున్నావు.. నీవు ఎవరు అంటూ నిలదీశాడు. దీంతో అతడు ఆ బోగీ నుంచి మరో భోగీకి పారిపోయడు. చివరకు అతన్ని బిజ్నోర్‌లోని నిజామాబాద్ స్టేషన్‌లో పట్టుకున్నారు. తిరిగి ఆ యూనీఫామ్‌ని TTE జస్వంత్ సింగ్‌కి బ్యాగ్‌తో సహా ఇచ్చారు. రియల్ టీటీఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.