బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్ షో లో వేసే పంచులు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఒక్కోసారి జడ్జి లపై కూడా గ్యాప్ లేకుండా పంచులు వేస్తుంటాడు..ముఖ్యంగా ఢీ షోలో అయితే సుధీర్ ను టార్గెట్ చేస్తూ పంచులతో రెచ్చిపోవడం హైపర్ ఆదికి తెలిసిందే. గతంలో యాంకర్ వర్షిణితో రొమాన్స్ చేసిన ఆది ఇప్పుడు ఢీ షోలో ఒంటరి అయ్యాడు. కొత్త యాంకర్ గీతతో కెమిస్ట్రీ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. ముఖ్యంగా హైపర్ ఆది తన కామెడీ పంచింగ్ టైంను నెమ్మదిగా లూజ్ అవుతున్నాడనే చెప్పాలి.

అయితే హైపర్ ఆది తన కామెడీలో ఎక్కువగా బాడీ షేమింగ్ పైనే దృష్టి పెట్టడం వల్లనే ఇలాంటి చిక్కులు వచ్చిపడుతున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది తాను ఎవరినైతే టార్గెట్ చేసుకుంటాడో ఇక వారిపై పంచులతో విరుచుకుపడతాడు. ముందు వెనుక చూడకుండా మాటలు అనేస్తాడు. వాళ్లు తిరిగి ఏమి అనకపోతే మరింత రెచ్చిపోతాడని అతడి సన్నిహితులు అంటుంటారు. సాధారణంగా కామెడీ చేసేముందు ఒక సారి ఎవరిపైన అయితే పంచులు వేస్తారో వారికి ఓ మాట చెప్పి వేయడం జబర్దస్త్ లో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ, ముఖ్యంగా మహిళా యాంకర్లపై కామెంట్స్ చేసే ముందు వారికి ఓ మాట చెప్పి పర్మిషన్ తీసుకుంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. కానీ హైపర్ ఆదికి మాత్రం ఇవేవీ పట్టినట్లు కనిపించడం లేదు.

ముఖ్యంగా హైపర్ ఆది తన మాస్ పంచులతో ఎవరు కనిపిస్తే వారిపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది ఇలాగే రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆది ఇప్పుడిప్పుడే జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకుంటున్న యాంకర్ వర్షను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వర్షను ఉద్దేశించి పలు కామెంట్స్ చేయడం సంచలనంగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన ప్రోమోలో వర్షను ఉద్దేశించి లేడీ గెటప్ కంటెస్టెంట్ అంటూ ట్రాన్స్ జెండర్ కామెంట్స్ చేయడం దుమారంగా మారింది.అలాగే అదే షోలో ఇమ్మాన్యువల్ ను ఉద్దేశించి బూతు పదం కూడా ఉపయోగించడంతో హైపర్ ఆది పై సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా వస్తున్నాయి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here