80, 90లలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ప్రస్తుతం కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉండగా మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఈ విధంగా 80,90 లలోఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సుకన్య గురించి ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వారికి ఈమె సుపరిచితమే.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఈమె పెద్దరికం సినిమా ద్వారా జగపతిబాబు సరసన తెలుగు పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తమిళ నిర్మాత రమేష్ కుమార్తెగా భారతీయ రాజా దర్శకత్వంలో వచ్చిన ఫుదు నెల్లు పుదు నాథు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుకన్య ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ప్రస్తుతం సుకన్య విదేశాలలో నివసిస్తున్నారు అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.
మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో మరోసారి జగపతిబాబుకి భార్యగా మహేష్ బాబుకి తల్లిగా సుకన్య సందడి చేశారు.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.
ఇకపోతే పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో అమృతవల్లి పాత్రలో నటించి సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.