ఈ టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్: సీనియర్ ఎన్టీఆర్ గుంటూరులోని ఎసి కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు.

ఏఎన్ఆర్: ఏఎన్ఆర్ పదో తరగతి వరకు చదువుకున్నారు.

కృష్ణ: ఏలూరు సి ఆర్ ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

చిరంజీవి: మెగాస్టార్ వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడుగా పట్టా పొందారు.

బాలకృష్ణ: హైదరాబాద్ నిజాం కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

నాగార్జున: నాగార్జున నాగేశ్వరరావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం మెకానికల్ ఇంజనీర్ చదువును పూర్తి చేసి ఇండస్ట్రీ లోకి వచ్చారు.

వెంకటేష్:  ఈయన USAలోని ది మాంటెరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి MBA చేశారు.

పవన్ కళ్యాణ్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు స్వయంగా వెల్లడించారు.

మహేష్ బాబు: బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

జూనియర్ ఎన్టీఆర్: హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

ప్రభాస్: ప్రభాస్ బిటెక్ పూర్తి చేసి అనంతరం వైజాగ్ లోనే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు.

రానా: బి.కామ్‌లో చేరిన తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు.

అల్లు అర్జున్: అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

రామ్ చరణ్: రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డిగ్రీ పొందాడు.

నాగచైతన్య: నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య బీకాం పూర్తి చేశారు.

నితిన్: ఈయన ఇండస్ట్రీలోకి రాకముందే బిటెక్ పూర్తి చేశారు.

రాజమౌళి:దర్శకుడుగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందారు.