గోల్డెన్ బ్రీఫ్ కేస్ అందుకొని రన్నర్ గా నిలిచిన శ్రీహన్ ఎన్ని లక్షల గెలుచుకున్నారో తెలుసా?

 బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎవరు విజేతగా నిలుస్తారన్న అంశంపై ఆతృత నెలకొంది.

ఆ డబ్బు తీసుకొని బయటకు రావడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇక రవితేజ అందులో ఉన్న ప్రైజ్ మనీ 25% పెంచినప్పటికీ ఎవరు కూడా డబ్బు తీసుకొని బయటకు రావడానికి ఇష్టపడలేదు.

అయితే బయట ఉన్న కీర్తి స్నేహితులు తనని 25 లక్షల తీసుకొని రమ్మని చెప్పినప్పటికీ ఆమె మాత్రం తీసుకోకుండా టాప్ త్రీ లో హౌస్ నుంచి బయటకు వచ్చారు. 

ఇక హౌస్ లో శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ ఉన్న సమయంలో నాగార్జున 25 లక్షల క్యాష్ ఉన్నటువంటి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోపలికి వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆ 25 లక్షలు తీసుకొని రావడానికి ఇద్దరు ఆసక్తి చూపలేదు. ఇక దానిని 30 మరియు 40 లక్షలు చేశారు. 

ఇలా 40 లక్షలు చేసేటప్పటికీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల అభిప్రాయం కూడా అడిగారు.

చాలామంది డబ్బు తీసుకోమని శ్రీహానికి సలహా ఇచ్చారు. ఇక శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా తనకు డబ్బులు తీసుకోమని చెప్పడంతో తన తల్లిదండ్రుల చెప్పిన మాట ప్రకారం శ్రీహన్ 40 లక్షల తీసుకొని బయటకు వచ్చారు.

ఇలా రన్నర్ గా నిలిచిన శ్రీహన్ 40 లక్షల గెలుచుకోగా విన్నర్ గా నిలిచిన రేవంత్ మాత్రం కేవలం పదిలక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.