ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు మొనగాడు, ఇది కథ కాదు లాంటి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించారు. ఇలా చిరంజీవి యాక్టింగ్ చూసి సినిమాలలో హీరోగా అవకాశాలు ఇచ్చారట. అలా చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట విలన్ గా కెరీర్ ను ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత చిన్న చిన్నగా హీరో పాత్రలలో నటిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు మోహన్ బాబు. 

హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా మొదట తలంబ్రాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ తలంబ్రాలు సినిమాలో నటనకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా మారుతూ  స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్.

తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ జయం, యజ్ఞం లాంటి మూవీస్ లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

జెడి చక్రవర్తి కూడా కెరీర్ ఆరంభంలో మొదట్లో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత చూస్తుండగానే హీరోల పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..