బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 14వ వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో నుంచి వర్మ హీరోయిన్ ఇనయా బయటకు వచ్చారు.
టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉంటుందని భావించిన ఇనయా ఊహించని విధంగా 14వ వారం ఎలిమినేట్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ప్రతి టాస్క్ లోను ఎంతో గట్టి పోటీ ఇస్తూ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసిన ఇనయా టాప్ పొజిషన్ లో ఉంటుందని అందరూ భావించారు.
ఇలా రేవంత్ కి గట్టి పోటీ ఇస్తూ హౌస్ లో కొనసాగుతున్న ఈమె 14వ వారం ఎలిమినేట్ అయింది.
ఈ కార్యక్రమం మొదట్లో కాస్త తడబడిన ఇనయా మొదటి నాలుగు వారాలలోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు.
అయితే క్రమక్రమంగా ఈమె ఆట తీరు మెరుగు పడటంతో రేవంత్ కి సైతం పోటీగా నిలబడింది.
ఇలా టాప్ టు లేదా టాప్ త్రీ లో కొనసాగుతుందని భావించిన ఈమె ఎలిమినేట్ కావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
ఇకపోతే 14 వారాలు పాటు హౌస్ లో కొనసాగిన ఇనయా బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
14 వారాలు పాటు హౌస్ లో కొనసాగిన ఈమెకు బిగ్ బాస్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ ద్వారా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న ఇనయా... ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు
ఈమెకు ఒక వారానికి సుమారు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.
ఇలా 14 వారాలకు గాను ఈమె సుమారు 15 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని సమాచారం. ఇలా 15 లక్షల రెమ్యూనరేషన్ అంటే మంచి రెమ్యూనరేషన్ అని చెప్పాలి.