హాస్పిటల్లో నటి కల్పికా... సర్జరీ నిర్వహించిన వైద్యులు.. అసలేమైందంటే?

 కల్పికా గణేష్ పరిచయం అవసరం లేని పేరు.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నటువంటి ఈమె తాజాగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సమంతతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించిన కల్పిక తాజాగా సమంత నటించిన యశోద సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.

ఇకపోతే తనకు సమంత లాగే మయోసైటిసిస్ వ్యాధి ఉందంటూ అందరికీ షాక్ ఇచ్చారు. 

సమంత థర్డ్ స్టేజ్లో ఉండగా తాను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నానంటూ తన గురించి వెల్లడించారు. 

యశోద సినిమా అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేసిన కల్పిక ఉన్నఫలంగా ఆసుపత్రి పాలయ్యారు.

ఈ విధంగా ఈమె హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆందోళన చెందారు. 

ఇక కల్పిక గత కొంతకాలం నుంచి వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉన్నారని తెలుస్తోంది. 

ఈ నొప్పి కారణంగా ఎక్కువ సేపు నిలబడలేకపోవడం అలాగే కూర్చోలేకపోవడం ఇబ్బందులు తలెత్తాయని ఈమె వెల్లడించారు.

ఇలా వెన్నునొప్పి కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి కల్పికాకు వైద్యులు సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈమెకు జరిగిన సర్జరీని లుంబార్ రాడిక్యులోపతి అని అంటారు.

సర్జరీ జరిగిన అనంతరం కల్పిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘చివరికి అంతా సవ్యంగా జరిగింది..

 నా పోరాటం చివరికి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి’ అంటూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.