టీడీపీ ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ తప్పకుండా వస్తారు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారకరత్న!

నందమూరి వారసుడు తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన రాజకీయ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలుపర్రలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారకరత్న పాల్గొన్నారు.

ఈ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ...నందమూరి ఫ్యామిలీ ఏనాడు పదవులను కోరుకోలేదు ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నాము. 

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. 

ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడుని గెలిపిద్దాం తిరిగి ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి బాటలో నడిపిద్దామని తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికలలో తాను పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీకి కూడా దిగుతానని తెలిపారు.

టైం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఎన్టీఆర్ తప్పనిసరిగా పాల్గొంటారని ఈ సందర్భంగా తారకరత్న తెలిపారు.

ఇలా ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేటి నుంచి నా ప్రతి అడుగు జనం కోసమే.. నా చూపు ఆంధ్ర అభివృద్ధి వైపే ఉంటుంది. బాలయ్య బాబాయ్ కి అబ్బాయిగా... చంద్రబాబు మామయ్యకు మేనల్లుడిగా..

మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వాదాలు శ్రీరామరక్షగా నమ్ముతున్నాను అంటూ ఈ సందర్భంగా తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇలా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారని తెలియడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి తారక్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.