స్టార్ హీరోకి అక్కగా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ సుపరిచితమే

 ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సునీత తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె నటించబోతుందని, 

ఈ సినిమా ద్వారా ఈమె వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని  పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర చాలా కీలకంగా ఉండడంతో త్రివిక్రమ్ సునీతను సంప్రదించారని, సునీతకు కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర చాలా కీలకంగా ఉండడంతో త్రివిక్రమ్ సునీతను సంప్రదించారని, సునీతకు కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సునీత వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుందని తెలియడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్.... ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 

అయితే కృష్ణ ఇందిరా దేవి మరణించడంతో ఈ షూటింగ్ కొన్ని రోజులపాటు వాయిదా పడి తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. 

ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించబోతున్నారు.