రణబీర్ -అలియా భట్: బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న రణబీర్ కపూర్ అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇక ఈ దంపతులకు కుమార్తె కూడా జన్మించారు.
నయనతార -విగ్నేష్: కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ 9వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు.
ఇక ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.
మౌని రాయ్ -సూరజ్ నంబియా: బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ ఏడాది జనవరి 27వ గోవాలో ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు..
హన్సిక - సోహైల్ కతురియా: నటి హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తితో డిసెంబర్ నెల నాలుగవ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
పూర్ణ - అసిఫ్ అలీ ఖాన్: నటి పూర్ణ తన ప్రియుడు ఆసిఫ్ అలీ ఖాన్ తో అక్టోబర్ 25వ తేదీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
అదితి ప్రభుదేవా - యషాస్‌ని: అదితి ప్రభుదేవా యషాస్‌ని నవంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
నాగశౌర్య -అనూష శెట్టి: నటుడు నాగశౌర్య బెంగుళూరు కి చెందిన డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని నవంబర్ 20వ తేదీ బెంగళూరులో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.