YS Jagan: జగనే మళ్లీ ఏపీ సీఎం.. తేల్చి చెప్పేసిన చివరి మూడు సర్వేలు.. వార్ వన్ సైడే!

YS Jagan: మరొక రెండు రోజులలో ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఎన్నికలపైనే ఉంది. ఇక ఇప్పటికే ప్రచార కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేశారు. ఇక ఎన్నికలు మరొక 48 గంటలలో జరగబోతున్నటువంటి తరుణంలో ఓకే ఒక్కరోజు ఏకంగా మూడు ప్రధాన సంస్థలు నిర్వహించిన సర్వేలో వైసిపికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.

రేస్ సర్వే ఇప్పటికే చాలాసార్లు సర్వే ఫలితాలను వెల్లడించగా తాజాగా తుది సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో కుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదని తేలిపోయింది. అలాగే ఈసారి వైసీపీ 120 నుంచి 130 సీట్ల వరకు గెలుపొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించింది.

ఇక ఈ సర్వేతో పాటు పోల్ స్ట్రాటజీ గ్రూప్, ఎలక్ సెన్స్ సర్వే ఫలితాలు వెల్లడి కాగా ఈ సర్వేలలో సైతం వైసీపీ 120కు పైగా స్థానాలలో సత్తా చాటే ఛాన్స్ అయితే ఉందని వెల్లడైంది. వరుసగా సర్వేలలో జగన్ దే హవా అని తేలింది. ఇలా ఒకేసారి మూడు సర్వేలు ఎన్నికలకు చివరి దశలు సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించగా వార్ వన్ సైడ్ అని తెలుస్తుంది.
కూటమికి ఓటమి తప్పదా..
గతం ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సేవలను అలాగే అందించిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో వైసీపీకి మెజారిటీ ఓట్లు వస్తున్నాయని ఏ సర్వే చూసిన వైసిపికి అనుకూలంగానే రావడంతో మరోసారి ఏపీలో సీఎం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని సర్వేలు తేల్చి చెప్పేసాయి. ఇలా ఈ సర్వే ఫలితాలను చూసి కూటమిలో కూడా ఓటమి భయం పట్టుకుందని చెప్పాలి.