Hero Suman : నేను తెలుగులో 99 సినిమాలలో హీరోగా నటించదానికి ఆ హీరో ప్రధాన కారణం. : సుమన్

Hero Suman : తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో సుమన్ అంటే ప్రత్యేకంగా పరిచయాలు లేవు. ఈయన అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేవారు. అలాంటి ఈ హీరో కెరియర్ లో ఒక అనుకొని విషాదం ఆయన కెరియర్ ని నాశనం చేసింది. ఇదిలా ఉంటే హీరో సుమన్ తెలుగు ఇండస్ట్రీకి ఎవరి వల్ల వచ్చారో తెలిస్తే మీరందరూ నోరేళ్లబెట్టాల్సిందే. ఇంతకీ ఆయన తెలుగులో హీరో ఎలా అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. సుమన్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు.

సుమన్,భానుచందర్  ఓరోజు షూటింగ్ విరామ సమయంలో.. లంచ్ చేస్తుండగా.. భానుచందర్ సుమన్ ని అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటి అలా చూస్తున్నావ్ అని సుమన్ అడగాగా.. నువ్వు చాలా బాగున్నావు. యు ఆర్ సో హ్యాండ్సమ్. మగాళ్ళమే నిన్ను చూస్తే చూపు తిప్పుకోలేకపోతున్నాం. ఇక ఆడవాళ్ళు నిన్ను చూస్తే చచ్చిపోతారంటూ భానుచందర్ సుమన్ ఎదుటే చెప్పేశాడు. తెలుగులో కూడా నువ్వు హీరోగా చేయాలంటు భానుచందర్, సుమన్ కి సలహా ఇచ్చారట.

తనకు తెలుగు భాష ఏ మాత్రం తెలియదంటూ.. అలాంటప్పుడు నేను తెలుగు సినిమాలలో నటించడమేంటని సుమన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. లాంగ్వేజ్ ది ఏముంది అదే వస్తుందని, అంతే కాదు స్వయంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కి సుమన్ ని పరిచయం చేసి ఆయన హీరో అవ్వడానికి కారణమయ్యారు. ఇలా సుమన్ మొదట్లో అస్సలు యాక్టింగ్ గురించి ఏమీ తెలియకుండా హీరో అయ్యాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవడంతో… అనేక సినిమాల్లో హీరోగా నటించారు.

అయితే సుమన్ ఈమధ్య ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 1980 ఆ ప్రాంతంలో భానుచందర్ సలహాతో బలవంతంగా తెలుగు సినీ పరిశ్రమలో కి అడుగు పెట్టాను.కానీ తెలుగు దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో నేను అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించగలిగాను.. ఇప్పటివరకు దాదాపు హీరోగా 99 చిత్రాల్లో నటించి ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాలలో నటిస్తున్నాను. నన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆ ఇంటర్వ్యూలో సుమన్ వివరించారు.