Priyadarshini Ram: తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియదర్శిని రామ్ మీడియా రంగంలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు. అయితే గత కొంతకాలంగా మీడియాకు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.
రామ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెబుతూ పలు విషయాలను తెలియజేశారు. తన మామయ్య ఫారెస్ట్ ఆఫీసర్ అని తెలిపారు.తనకు 24 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మాయి వయసు 18 సంవత్సరాల అన్ని తెలిపారు. తనని ప్రేమిస్తున్నాను అంటూ ఒకరోజు అమ్మాయికి చెప్పడంతో కుదరదని మొహం మీద చెప్పింది. అయితే తన గురించి తన పరిస్థితి గురించి తన తల్లి గురించి వివరించడంతో ఒక వీక్ మూమెంట్లో ఓకే చెప్పిందని తెలిపారు.
ఈ విధంగా అమ్మాయి తను ప్రేమకు ఒప్పుకున్నప్పటికీ తన తండ్రిని ఒప్పించాలన్న ఉద్దేశంతో తన తండ్రితో స్నేహం చేయడం మొదలు పెట్టానని తెలిపారు. తన తండ్రి పేకాట ఆడుతూ కూర్చునేవారని అయితే వారితో కలిసి తాను కూడా పేకాట నేర్చుకోవడానికి వెళ్ళాను అప్పటివరకు నాకు ఎలాంటి అలవాటు లేకపోయినా తన తండ్రితో స్నేహం కోసమే అక్కడికి వెళ్లే వాడినని తెలిపారు.తన తండ్రితో స్నేహం పెంచుకోవడమే కాకుండా పేకాట కూడా నేర్చుకున్నానని తన తండ్రి కోసం ఎన్నోసార్లు ఓడిపోయానని తెలిపారు.
ఇలా తనతో మంచి స్నేహం ఏర్పడిన తర్వాత తన కుమార్తెను ప్రేమిస్తున్నానని తను కూడా నన్ను ప్రేమిస్తుంది. పెళ్లి చేయమని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి తన కూతురిని ఒంటరిగా ఎక్కడికి పంపించేవారు కాదు.అయితే ఒక రోజు కాలేజీ నుంచి తనని తీసుకెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నామని మా ప్రేమ విషయం తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారని ఆయన స్వయంగా రిజిస్టర్ ఆఫీస్ కి ఇన్ఫామ్ చేసి ముందుగా డాక్యుమెంట్స్ సిద్ధం చేయించారని తెలిపారు. ప్రస్తుతం రామ్ తన లవ్ స్టోరీ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…