Category Archives: Political News

YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?

YS Jagan: ఏపీ ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ కేసులను నమోదు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

జగన్‌తో పాటు అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైయస్ జగన్ ఆదేశాల మేరకే నన్ను అరెస్టు చేశారని అదే విధంగా కస్టడీలో ఉన్నటువంటి తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.

అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏ3గా ఉన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను పోలీసులు చేర్చారు.

కొట్టివేసిన కేసుపై ఎఫ్ ఐ ఆర్..
ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారడంతో ఏవన్ గా ఉన్నటువంటి సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు గురించి కోర్టు మూడు సంవత్సరాల క్రితమే ఈ పిటీషన్ ని కొట్టి వేసింది తిరిగి ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఏంటో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ సునీల్ కుమార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

AP: మెగాస్టార్ చిరంజీవి కి కీలక బాధ్యతలు అప్పజెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీని కూడా అభివృద్ధి పథం వైపు నడిపించేలా అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో ఎంతో విజయవంతమైన ఇండస్ట్రీని అమరావతికి కూడా తీసుకురావడం కోసం చిత్ర పరిశ్రమతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సన్న హాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొంతమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవితో సంప్రదింపులు చేసిన అనంతరం చిత్రపరిశ్రమ అభివృద్ధి గురించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.ఏపీకి సినీ పరిశ్రమకు మధ్య బాండింగ్ ని ఏర్పరిచేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని అది కూడా చిరంజీవితో చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి ఏపీ రాజకీయాలలో కూడా భాగం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కూడా చిరంజీవి హస్తము ఉంటుందని తెలుస్తోంది. రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం పైన ఇప్పటికే చాలామంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా తెలుస్తోంది.

వారధిలా చిరంజీవి..
ఈ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు భాగ్యస్వామ్యంతో అమరావతిలో ఒక అద్భుతమైన స్టూడియోని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏపీలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు విషయాలన్నింటినీ కూడా చిరంజీవికే బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది. ఈయన చిత్ర పరిశ్రమకు కూటమి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండబోతున్నారని తెలుస్తోంది.

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి?

YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలిచారు కానీ ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే స్పీకర్ కి లేఖ రాస్తూ తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే సమస్యల పట్ల ప్రశ్నించే హక్కు ఉంటుందని ఈయన లేఖ రాసినప్పటికీ స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు.

ఈ క్రమంలోనే ఈయన అసెంబ్లీలోకి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడపలో ఉప ఎన్నికలను నిర్వహిస్తూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా ఎన్నికలలో పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

ఇక ఇటీవల వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది. అలా జరిగితే షర్మిల తరపున నేను ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. దీంతో ఈ వార్తలు మరింత చక్కర్లు కొట్టడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ చిన్నాన వై వి సుబ్బారెడ్డి స్పందించారు.

దుష్ప్రచారాలే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తారని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని ఇవన్నీ కేవలం టిడిపి వారి దుష్ప్రచారాలే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా జగన్ గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం లేదని ఈయన వెల్లడించారు.

AP: జగన్ షర్మిల గొడవకు అదే కారణమా… మొండి తనమే రాజకీయ పతనానికి కారణమవుతుందా?

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనమైన విజయాన్ని సొంతం చేసుకుంది కానీ ఈసారి మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈసారి జగన్ ఓటమి కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక 2019వ సంవత్సరంలో జగన్ భారీ మెజారిటీతో గెలవడానికి షర్మిల కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.

జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీ బాధ్యతలను తీసుకొని పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లింది. అలాగే అన్నకు తోడుగా పాదయాత్రలో భాగమై ఈ పార్టీ గెలుపుకు ఎంతగానో కృషి చేసింది. ఇలా తన అన్న విజయానికి ఎంతగానో దోహదం చేసిన షర్మిల ఈసారి ఎన్నికలలో మాత్రం తన అన్నయ్య ఓటమికి ఒక కారణంగా నిలిచింది.

జగన్ షర్మిల ఇద్దరూ గొడవ పడటానికి కారణం ఆస్తులే అని వార్తలు వచ్చాయి కానీ వీరిద్దరి మధ్య అంతకుమించిన గొడవ ఏదో ఉందని తెలుస్తుంది. ఆస్తుల వల్లే గొడవలు అయితే ఈమె కోర్టుకు వెళ్లి లీగల్ గా తన ఆస్తులను తాను సొంతం చేసుకోవచ్చు కానీ వీరి మధ్య మరేదో గొడవ ఉందని అది విజయమ్మ కూడా పరిష్కరించే సమస్య కాదని తెలుస్తోంది.

ఆస్తుల పంపకాలు..
జగన్ షర్మిల రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం వల్లే ఈమె తన అన్నను కాదని ఇలా మరో పార్టీలోకి వచ్చి తన అన్నను కూడా దెబ్బ తీస్తోందని తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ఇలా మొండిగా ఎవరికివారు వెళ్లడం పట్ల వైయస్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొండి తనంతో ప్రవర్తిస్తే ఇద్దరికీ ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి యధావిధిగా ఒకే తాటిపై నడిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అభిమానులు భావిస్తున్నారు.

AP: ఏపీ ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు!

AP: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా ఉచిత హామీలనే ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాము అధికారంలోకి రావాలి అంటే ఉచితంగా ఇసుక ఇస్తాం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తాము అంటూ ఇటీవల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వంలో కూడా కొన్ని పథకాలను పేదలకు ఉచితంగా ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఇలా అధికారంలోకి రావడం కోసం రాజకీయ నాయకులు ఉచిత హామీలను ప్రకటించడం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు పరిపాలనలో ఉచితం అనే పదాన్ని తీసేయాలని తెలిపారు..

ప్రజలకు ఏదైనా మౌలిక వసతులు కల్పించేలా పరిపాలన సాగించాలి అలాగే జీవనోపాధిని చూపెడుతూ పరిపాలన సాగించాలి కానీ రాజకీయ నాయకులే ఉచితం అని పదాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారని తెలిపారు.ఉచిత పథకాలను వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారని కడుపు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత పథకాల మీద కోపంగానే ఉంటారు అంటూ తెలిపారు.

ఉచితం అనే పదాన్ని తొలగించాలి..
ఇలా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఈయన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రాణ స్నేహితుడు. మరి ఈయన చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చే సమయంలో ఇది తప్పు అని ఎందుకు సలహా ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకువస్తూ ఆయా వృత్తుల వారికి ఆసరా కల్పించారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్ని ఉచితమనే హామీలను ఇస్తూ అధికారంలోకి వచ్చారు అంటూ ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Chandra Babu: అవినీతి పోవాలంటే ఆ నోట్లు రద్దు చేయాలి… నోట్ల రద్దు పై బాబు వ్యాఖ్యలు!

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మన భారత దేశంలో 200 నోట్లు 500 నోట్లను రద్దు చేయాలి అంటూ బాబు తెలిపారు.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే 2000 రూపాయల నోట్లను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు కానీ కొద్ది రోజులకే ఆ రెండు వేల నోట్లో కూడా బ్యాన్ చేశారు తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు 200 నోట్లు అలాగే 500 నోట్లను రద్దు చేయాలి అంటూ తెలిపారు..

బ్యాంకులు వంద శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు.ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి తీసుకురావాలని తెలిపారు.

వ్యవస్థలు కుదేలయ్యాయి..
ఇలా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి వీరితో చర్చలు జరిపారు.గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని.. వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

AP: ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈసారి 164 సీట్ల మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వైసిపి నేతలు కార్యకర్తలు అభిమానులు షాక్ అయ్యారు. 2019వ సంవత్సరంలో 151 సీట్లతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ హాస్పిటల్స్ ఎంతో అభివృద్ధి చేశారు అలాగే మెడికల్ కాలేజీలు, పోర్టులు వంటి వాటిని నిర్మిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా అందించారు. దీంతో కచ్చితంగా ఈసారి కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ఊహించని విధంగా వైసిపి ఘోరమైన ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే వైసీపీ ఫలితాలపై ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఈయనకు ప్రశ్నలు రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీ ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. ఇక షర్మిలను పావులా ఉపయోగించుకున్నారని, అంతకుమించి ఆమె పాత్ర ఏమాత్రం లేదని కేటీఆర్ తెలిపారు.

కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి…
ఇక ధర్మవరం ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కేతిరెడ్డి ప్రతిరోజు ప్రజలలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడే పరిష్కరించేవారు అలాంటి కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అప్పుడెప్పుడో ఓ సినీ కవి చెప్పారు. ఈ విషయాన్ని కాస్త ఒంట బట్టించుకుంటే బాగుండేది.. లేదు ఆలస్యం.. అమృతం.. విషం అన్నారు కదా… దానినైనా అర్థం చేసుకుని తొందరపడి ఉంటే బాగుండేది. అటు ఇటు కానీ సమయంలో తొందరెందుకు? ఏంటిది సూక్తుల మీద సూక్తులు? ఇంతకీ ఎవరి గురించి అంటారా? ఇంకెవరి గురించి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి. ఆయనో స్కెచ్ వేశారు. వేసిన స్కెచ్ మంచిదే. కానీ చాలా ఆలస్యమైంది.. చాలా తొందరపడుతున్నారు.. అటు ఇటు కానీ సమయంలో స్కెచ్ గీశారు. మళ్లీ మొదలు పెట్టేశాం అంటారా? అసలు ఏంటా స్కెచ్? దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు గీయడం వలన అభ్యంతరం ఏంటి? అంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్ వేయాల్సిందే..

ట్రెండ్ సెట్ చేసింది వైఎస్సే..

పాదయాత్ర.. ఎన్నికల సమయంలో ఇదొక ట్రెండ్.. ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అనడంలో సందేహం లేదు. ఈ పాదయాత్రను నిర్వహించి వైఎస్ ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. ఇక ఆ తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారి పాదయాత్ర.. కట్ చేస్తే సీఎం పీఠం. ఏపీలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సైతం ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. తను మంత్రయ్యారు.. తండ్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు సంబంధించి పవర్‌ఫుల్ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని కేటీఆర్ పఠించాలని అనుకుంటున్నారు. మీరే చెప్పండి.. ఆలస్యమైందా.. కాలేదా? ఎన్నికలకు ముందు చేస్తే జనంలో బాగా నోటెడ్ అవుతారు.. జనం సమస్యల పరిష్కారంపై భరోసా ఇచ్చినట్టుగానూ అవుతుంది. దీనికోసం నాలుగేళ్లు ఆగాలి కదా.. మరి కేటీఆర్ ఎందుకు ఇంత తొందరపడుతున్నట్టు. వేళగాని వేళ ఏ మంత్రమైనా సరే పఠిస్తే ప్రయోజనం ఉంటుందా? దానికో నిర్ధిష్ట సమయం.. సందర్భం ఉంటుంది.

రీకాల్ చేసేంత డెవలప్ చెందలేదు కదా?

అయితే ఈ మంత్రం ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రమే పఠించారు కాబట్టి కేటీఆర్ ఎన్నికలకు ముందు పఠించినా ప్రయోజనం ఉండేది కాదేమో. ఎన్నికలకు ముందు అది కూడా అధికార పార్టీ నేత పాదయాత్ర అంటే జనం ఎలా రిసీవ్ చేసుకునేవారో తెలిసేది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నా ప్రయోజనం శూన్యం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ షెడ్యూల్ అంతా ఖరారవుతోందట. అయినా సరే టూ ఎర్లీ కదా.. 2028లో పాదయాత్ర చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ ఆలోచనా విధానం మరోలా ఉంది. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో నిరుద్యోగులు, రైతులు, కరెంట్ కష్టాలవంటివి బీభత్సంగా పెరిగి పోయాయి. కాబట్టి వాటిని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తీసుకెళ్లి మాత్రం ఇప్పుడేం చేస్తుంది? ఏం సాధిస్తుంది? ఎన్నుకున్న నేతలను రీకాల్ చేసేంత డెవలప్ అయితే మనం చెందలేదు కదా అంటారా? అయితే కేడర్‌లో ఎంతో కొంత ఉత్సాహాన్ని అయితే తీసుకురావచ్చు. బీఆర్ఎస్‌ దీపం పూర్తిగా కొండెక్కకుండా కాస్త చమురు పోసే యత్నం. అంతకు మించి గులాబీ బాస్ కేసీఆర్.. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే యోచన అని కూడా అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Bharateeyudu 2: సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్.. ఆ పని మొదలుపెట్టిన భారతీయుడు 2 టీం?

Bharateeyudu 2: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చిత్ర పరిశ్రమకు సంచలన విషయాలను తెలియజేసిన సంగతి తెలిసిందే. చిత్ర బృందం ఎవరైనా సినిమా టికెట్లు రేట్లు పెంచాలని ఇతర అవకాశాలను చిత్ర పరిశ్రమకు కల్పించాలని ప్రభుత్వం వద్దకు వచ్చేముందు సినిమా సెలబ్రిటీలందరూ ఒక పని చేయాలి అంటూ ఈయన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన సైబర్ క్రైమ్స్ అడ్డుకట్ట వేయడం కోసం ప్రతి ఒక్కరికి అవగాహన చేసే విధంగా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచాలి అంటే సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఆ సినిమా ప్రసారానికి ముందుగా ఒక రెండు నిమిషాల వీడియోని ఇలా డ్రగ్స్ కి వ్యతిరేకంగా అలాగే సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పిస్తూ వీడియో చేయాలని సూచించారు.

డ్రగ్స్ వాడొద్దు..
ఇలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత విడుదలవుతున్నటువంటి మొట్టమొదటి చిత్రం భారతీయుడు 2. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారతీయుడు 2టీమ్ లోని నటీనటులు కమల్ హాసన్, సిద్దార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. డ్రగ్స్ వాడొద్దు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు అంటూ చెప్తూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేసారు.

AP: అదే చంద్రబాబు సక్సెస్… జగన్ ఓటమిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు!

AP: దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలోనే విజయవాడ పార్టీ కార్యాలయం ఎదుట వైయస్సార్సీపీ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంబంటి రాంబాబు వంటి వారందరూ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసిపి ఓటమి కావడానికి కారణం చంద్రబాబు అబద్ధాలేనని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా కుల మతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు.

ఇకపోతే చంద్రబాబు నాయుడు ఎలాగైనా అందలం ఎక్కాలన్న ఉద్దేశంతో తప్పుడు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేశారని ఇలా ఈయన మోసం చేయడంలో బాగా సక్సెస్ అయ్యారని అదే ఆయన విజయానికి కారణం అంటూ సజ్జల తెలిపారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలలో 10 శాతం నెరవేర్చిన చాలని సజ్జల వెల్లడించారు.

బాబు ప్రజలను మోసం చేశారు..
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైయస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇలా సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు కానీ జగన్ పద్ధతి అలా కాదు అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్ కి ఇష్టం లేదంటూ సజ్జల చేసి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.