Category Archives: Movie News

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆగని అవార్డులు.. ఫిలింఫేర్ అవార్డులలో సత్తా?

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ సినిమాకు మాత్రం అవార్డులు రావడం ఆగలేదని చెప్పాలి. తాజాగా 2023వ సంవత్సరానికి గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా పలు తెలుగు సినిమాలకు భారీ స్థాయిలో అవార్డులు రావటం విశేషం.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఏడో ఫిలింఫేర్ అవార్డులు రావడం విశేషం. మరి ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా ఈ ఏడు అవార్డులు ఏ ఏ విభాగానికి వచ్చాయి ఎవరు అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ డైరెక్టర్ గా రాజమౌళి, ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, గా కీరవాణి ఈ అవార్డులను అందుకోబోతున్నారు.

ఏడు విభాగాలలో అవార్డులు..
వీరితోపాటు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ ప్రొడక్షన్ డివైన్ విభాగంలో సాబు సిరిల్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా కొమరం భీముడు సింగర్ కాలభైరవ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇలా ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా ఏడు విభాగాలలో ఈ అవార్డులు ఈ సినిమాకు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ananth Ambani: వామ్మో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే?

Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.

ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

5000 కోట్లు..
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.

Lavanya: పవన్ మూడు పెళ్లిళ్ల పై లావణ్య షాకింగ్ కామెంట్స్.. ఆయన వద్దే తేల్చుకుంటా అంటూ?

Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Vijay Devarakonda:విజయ్ దేవరకొండ గొప్ప మనసు.. కన్నీళ్లు పెట్టుకున్న ట్రాన్స్ జెండర్.. ఏమైందంటే?

Vijay Devarakonda: ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన హీరోగా కొనసాగుతున్న ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా లాక్ డౌన్ పడటంతో ఎంతోమంది జీవనోపాధిని కోల్పోయి కనీస తిండి కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు అలాంటి వారిని ఆదుకోవడం కోసం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈయన విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 6000 కుటుంబాలకు సహాయం అందించారు.

అయితే తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ సీజన్ 3 కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సహాయం చేసిన కొంతమంది కుటుంబాలను ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ కరోనా సమయంలో మాకు జీవనోపాధి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.

కనిపించే దేవుడు..
రోడ్లపై అడుక్కు తింటూ జీవనం గడిపే వాళ్ళం. అలాంటి సమయంలో మీరు ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిసి అప్లై చేసుకున్నాము వెంటనే మాకు సాయం అందిందని తెలిపారు. నాతోపాటు 18 మంది ట్రాన్స్ జెండర్లకు మీ ఫౌండేషన్ ద్వారా సహాయం అందింది. అప్పటినుంచి మిమ్మల్ని కలిసి ఒక్కసారైనా కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాము మీరు కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో విజయ్ దేవరకొండ కూడా ఈమె మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Naveen: నాన్నకు ఏమో నాలుగు పెళ్లిళ్లు.. నాకు పెళ్లె కాలేదు.. తండ్రి పెళ్లిళ్ల పై నవీన్ కామెంట్స్!

Naveen: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నరేష్ ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న నరేష్ ఏకంగా వ్యక్తిగత జీవితంలో మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంచలనంగా మారారు. ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన ఇటీవల కాలంలో సినీనటి పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ వీరి పెళ్లిళ్ల గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు తన తండ్రి పెళ్లిళ్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తండ్రికేమో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు మీరు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి విమర్శలపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. నాన్న పెద్ద కుటుంబం నుంచి వచ్చారు అందుకే ఆయన పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉన్నారు పిల్లల గురించి పట్టించుకోవడంలేదని చాలామంది విమర్శిస్తున్నారు అయితే నేను ఇలాంటి వాటి గురించి పట్టించుకోనని తెలిపారు.
విమర్శలు పట్టించుకోను…

నాన్న ఆస్తులు ఆయన పెళ్లిళ్లు గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయన పడిన ఇబ్బందుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఈ విమర్శించిన వారెవరు వచ్చే ఆదుకోలేదు. నేను ఇలాంటి విషయాలపై అసలు ఫోకస్ పెట్టి నా టైం వేస్ట్ చేయాలని అనుకోలేదు. ఇక మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగగా సరైన సమయం రాలేదు అందుకే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోవడం కంటే సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం మంచిది. నా లైఫ్ లోకి ఎవరైనా ఒక అమ్మాయి వస్తే పర్లేదు రాకపోయినా ఇలాగే ఉండిపోతాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Varalakshmi: వరలక్ష్మి నికోలయ్ పెళ్లి ఫోటోలు చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Varalakshmi: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె తన స్నేహితుడి నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ తర్వాత వీరికి సంబంధించిన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక వీరి వివాహం థాయిలాండ్ లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి సంగీత్, హల్దీ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రం ఎక్కడ షేర్ చేయలేదు.

అయితే తాజాగా వరలక్ష్మి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా వీరిద్దరూ సాంప్రదాయమైన దుస్తులను ధరించి హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం జరుపుకున్నారని తెలుస్తోంది. నికోలయ్ పట్టు వస్త్రాలను ధరించి ఉండగా వరలక్ష్మీ సైతం ఎరుపు రంగు పట్టుచీరను ధరించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉన్నారు.
సాంప్రదాయబద్ధంగా…

ఇక ఈ పెళ్లి వేడుకలలో రాధికా శరత్ కుమార్ కూడా ఎంత సంతోషంగా కనిపించారు. ఇలా సాంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగిందని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా థాయిలాండ్ లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు చెన్నైలో ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసినదే .ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

Poonam kaur: ప్రతి నాయకుడు లీడర్ కాలేరు.. మరోసారి బాంబు పేల్చిన పూనం కౌర్!

Poonam kaur: నటి పూనమ్ కౌర్ సినిమాల ద్వారా ఫేమస్ అవ్వడం కంటే సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తూ ఉంటారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించారు.

ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ టార్గెట్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనమైన పోస్టులు చేస్తూ వచ్చారు త్రివిక్రమ్ ను ఏకంగా పేరు పెట్టి మరి సంచలన పోస్టులు చేశారు ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఒక డైలాగ్ గురించి పోస్ట్ చేస్తూ డైలాగు పవన్ కళ్యాణ్ ది అయిన రాసింది మాత్రం త్రివిక్రమ్ అంటూ పోస్ట్ చేశారు.

అదేవిధంగా పొలిటికల్ పరంగా ఈమె ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాయకుడు అనేవారు మహిళలకు గౌరవం ఇస్తే వారి ఫాలోవర్స్ కూడా మహిళలకు గౌరవం ఇస్తారు.లీడర్ అంటే బాధ్యతలు మోసేవాడు.. తనని తాను ఉన్నతంగా, గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు.. ప్రతీ రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు అంటూ ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారు.

టాలెంట్ తొక్కేస్తారు..
ఈ క్రమంలోనే ఒక నెటిజన్స్ స్పందిస్తూ నీకు ఎలాంటి పని పాట లేదు ఎప్పుడూ ఒకరిపై పడి ఏడుస్తూనే ఉంటావు.నీలాంటి లేజీ ఇడియట్స్‌ని ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కి ఈమె రిప్లై ఇచ్చి వెంటనే డిలీట్ చేశారు అయితే ఇందులో గురూజీ టాలెంట్‌ను తొక్కేస్తాడు.. ఎస్కార్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటాడు.. గురూజీకి కావాల్సిన కారెక్టర్ లేదా టాలెంట్ నా దగ్గర లేదు అంటూ ఈమె త్రివిక్రమ్ గురించి కూడా ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Ramcharan: రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు ధర ఎంతో తెలుసా?

Ramcharan: సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ కు ఖరీదైన రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారులో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ ఖరీదైన కారులో రామ్ చరణ్ చాలా రాయల్టీగా కారు దిగి వెళ్లిపోయారు అయితే ఈ వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరి దృష్టి రాంచరణ్ వచ్చిన కారు పైనే ఉంది.

ఇప్పటివరకు హైదరాబాద్లో ఈ విధమైనటువంటి మోడల్ కార్ ఇదే మొదటి దని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కారు ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా రామ్ చరణ్ వచ్చిన ఈ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు ఖరీదు ఏకంగా 7.5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

అయితే రామ్ చరణ్ తో పాటు తన భార్య ఉపాసన కుమార్తె క్లిన్ కారా కూడా ఇదే కారులో ఎయిర్ పోర్టుకు చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరందరూ కలిసి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ తరుణంలోనే ఈ ఖరీదైన కారులో ఎంతో రాయల్టీ ఎంట్రీ ఇస్తూ రాంచరణ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.

అంబానీ పెళ్లి వేడుకలు..

అనంత అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వివాహ వేడుకకు ఎంతోమంది సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కేవలం రామ్ చరణ్ ఉపాసన జంటకు మాత్రమే ఆహ్వానం అందడంతో ఈ జంట ఈ పెళ్లి వేడుకల కోసం ముంబై వెళ్లారు.

Prakash Raj: పవన్, మహేష్ సినిమా డైలాగులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. చండాలంగా ఉందంటూ?

Prakash Raj: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి నటుడిగా ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు ఒక విలక్షణ పాత్రలో నటించాలన్న ఒక మంచి తండ్రి పాత్రలో నటించాలన్న ప్రకాష్ రాజుకు ఎవరు తీసిపోరు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి తనలో ఉన్న విలనిజం అందరికీ పరిచయం చేశారు.

ఇక తండ్రి తాత పాత్రలలో కూడా నటిస్తూ ప్రకాష్ రాజ్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమాలలో కూడా ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రకాష్ రాజ్ మహేష్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలోని డైలాగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు ప్రకాష్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు చిత్రం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ సినిమా మొత్తం నేను మహేష్ భూమిక మా ముగ్గురి మధ్య తిరుగుతూ ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో తను సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మను నేను రా అని చెప్పే డైలాగ్ తనకు చాలా బాగా నచ్చిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో కూడా ఈయన నేను మోనార్క్ ను నన్ను ఎవరు మోసం చేయలేరు అనే డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే డైరెక్టర్ ఈ డైలాగ్ తనకు చెప్పినప్పుడు ఇదేంటండి ఇంత చెత్తగా ఉంది అసలు ఈ డైలాగ్ మార్చండి అని నేను చెప్పాను.

నేను మోనార్క్.. నన్ను మోసం చేయలేరు
ఇక డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో చెప్పాల్సిన పరిస్థితిని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ డైలాగు చాలా పాపులర్ అయిందని ఎవరి నోట చూసిన ఇదే డైలాగ్ రావడంతో నా నిర్ణయం తప్పని వెళ్లి డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పాను అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh -Pavitra Lokesh: పిల్లల్ని కనడంపై నరేష్ పవిత్ర సంచలన వ్యాఖ్యలు.. మేము సిద్ధమే అంటూ?

Naresh -Pavitra Lokesh: సీనియర్ సినీ నటుడు నరేష్ ఇటీవల కాలంలో సినిమాల పరంగా కంటే వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. సీనియర్ దివంగత నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు..ఇక ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎన్నో వివాదాలలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న నరేష్ తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి విడిపోయారు. ఇలా వారితో ఉన్న మనస్పర్ధలు కారణంగానే విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా ముగ్గురు భార్యలను దూరం పెట్టిన నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు.

నటి పవిత్ర లోకేష్ తో కలిసి రిలేషన్ లో ఉన్నటువంటి నరేష్ తనని పెళ్లి కూడా చేసుకున్నారు ఈ విషయంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గతంలో సంచలనమైన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ జంటకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ వయసులోకి కూడా మీరిద్దరూ పిల్లలని కావాలనుకుంటున్నారా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలను కనడమే మా ఉద్దేశం కాదు.ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ ఉన్నాయని తెలిపారు.

పిల్లలు అవసరం లేదు..
ఇక ఈ విషయం గురించి నరేష్ కూడా మాట్లాడుతూ ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పవిత్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఐదుగురు మా పిల్లలేనని తెలిపారు. ఇప్పటికీ మేము పిల్లల్ని కనడానికి ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఫిట్ గా ఉన్నాము కానీ మాకు అవసరం లేదని తెలిపారు. మేము ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి 20 వచ్చేలోపు మా వయసు 80 సంవత్సరాలు అవుతుంది. అందుకే మా అమ్మ కృష్ణ గారి లాగే నేను పవిత్ర కూడా ఉండిపోవాలనుకున్నాము అంటూ ఈయన వెల్లడించారు.