పెసర పప్పును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలోదలరు..!

సాధారణంగా మనదేశంలో వరితో పాటు పెసరపప్పు ధాన్యాలను అధికంగా సాగు చేస్తారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పెసరపప్పు సాగుతో పాటు పెసర పప్పు వాడకం కూడా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పెసరపప్పుతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే మరికొందరు పెసరపప్పును దూరం పెడుతుంటారు. అయితే పెసరపప్పును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఎవరూ తినకుండా ఉండలేరు. మరి పెసరపప్పు ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పెసరపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ క్రమంలోనే మొలకెత్తిన పెసర పప్పును ప్రతి రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల అధిక శక్తిని పొందడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. పెసరపప్పులో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి మన శరీరానికి హాని కలిగించేటువంటి ఫ్రీరాడికల్స్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి.

పెసరపప్పులో ఉండే పోషకాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు మన శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తాయి.అయితే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం చేత జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను పూర్తిగా నివారిస్తుంది.

ప్రొటీన్లు ఫైబర్ లు అధిక మొత్తంలో ఉండటం చేత కొద్ది పరిమాణంలో ఈ పెసరపప్పును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.పెసరపప్పుతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవడమే కాకుండా సలాడ్ల రూపంలో కూడా వీటిని తీసుకుంటారు.