సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్లలో సింగర్ సునీత ఒకరు. తన మృదువైన గాత్రం ద్వారా అద్భుతమైన పాటలు పాడిన ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పవచ్చు. కేవలం పాటలు పాడి మాత్రమే కాకుండా తన అందం అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే సునీత తన రెండోపెళ్లి తరువాత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తన గురించి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకునేవారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఓ సారి సునీత మాట్లాడుతూ ఒక మ్యూజిక్ స్టూడియోలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకపాట పాడడం కోసం మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోకి వెళ్ళినప్పుడు తను పాట పాడడానికి నా చేతికి మైక్ ఇచ్చాడు. నేను పాట పాడాను పాట తర్వాత మైక్ మరి అక్కడే పెట్టి వస్తుండగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య నన్ను పిలిచారు. ఏంటి మైక్ తీసుకుంటూ మా ఆయనను తాకుతున్నావు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నేను కూడా గట్టిగా తనతో మాట్లాడానని ఈ సందర్భంగా సునిత తెలిపారు.
మైక్ ఇచ్చేటప్పుడు ఎలాంటి తప్పు జరగలేదన్న విషయం నాకు తెలుసు అయినా కూడా ఒకరి చేత మాటలు పడ్డానని ఎంతో బాధపడినట్లు..ఆ విషయం తలుచుకొని ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఈ సందర్భంగా సునీత తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏంటి ?అనే విషయాలను మాత్రం సునీత బయట పెట్టకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…