హీరో శివాజి హీరో కాకముందు ఏపని చేశావారో తెలుసా..??

చాలామంది సినిమా మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తారు. అయితే వచ్చే ఆలోచన అయితే ఉంటుంది గానీ ఎందుకు వస్తున్నారో ఏమవ్వాలని వస్తున్నారో మాత్రం కొంతమందికి ఒక క్లారిటీ ఉండదు. వచ్చాక గాలి ఎటు మళ్ళితే అటు వెళదామనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో హీరో అయినవాళ్ళు, డైరెక్టర్ అయినవాళ్ళు, ఎడిటర్ అయినవాళ్ళు..ఇలా 24 విభాగాలలో ఎదో ఒకదాంట్లో సెటిలవుతున్నారు. అయితే పక్కాగా హీరో అవ్వాలి..లేదా డైరెక్టర్ అవ్వాలి అనే గోల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.

ఇక ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఏదో రకంగా ముందు ఓ ప్లాట్ ఫాం ఏర్పరచుకొని దాని ద్వారా అనుకున్న గోల్ రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళలో టాలెంటెడ్ హీరో శివాజి కూడా ఉన్నారు. శివాజి ఇండస్ట్రీకొచ్చిన మొదట్లో ఆయన భాష మీద మంచి పట్టున్న కారణంగా బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. దాంతో కొన్నాళ్ళు యాంకర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో ఆయనకి చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కింది.

తనని తాను పోషించుకేందుకు జెమిని టీవీలో వీడియో ఎడిటర్‌గా చేరాడు. అప్పుడే యాంకరింగ్ చేసే అవకాశం పొందాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరంలో ఆయన చేయబోయే పరదేశి అనే సినిమా కోసం నూతన నటీనటులను ఆహ్వానిస్తూ స్టార్ 2000 కాంటెస్ట్ అనే ఒక పోటీ నిర్వహించారు. అందులో లయ, శివాజీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో నటించారు. కానీ దీని ద్వారా శివాజి అందరికి పరిచయం అయ్యాడు.

శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమా. అయితే తొలి అవకాశం ఇచ్చింది మాత్రం ప్రముఖ దర్శకుడు వై. వి. ఎస్. చౌదరి. సీతారాముల కళ్యాణం చూతము రారండీ సినిమాలో శివాజీకి హీరో స్నేహితుడి పాత్ర ఇచ్చారు. శివాజీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఆయన్ను కలవాలని ఎంతో ఆశ పడేవాడు. కానీ ఏకంగా మాస్టర్ సినిమాతో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ చాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపించాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు.

నిజ జీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని ఎన్నో సందర్భాలలో శివాజీ చెప్పాడు. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్రలో నటించే అవకాశం వచ్చినా చేయాలనికి ఎప్పుడూ సిద్దంగా ఉన్నానని శివాజీ తెలిపిన సందర్భాలున్నాయి. ఇక సినిమాల్లో శివాజీ అందుకున్న మొదటి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు అందుకున్న ఈ సంపాదనతో తల్లికి బంగారం కొన్నాడు.

ఇలా ప్రారంభం అయిన శివాజీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిర్మాతగా సినిమాలు చేశాడు. అయితే నిర్మాతగా చేసిన సినిమాతో దెబ్బతిన్నాడు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన శివాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించేందుకు చాలా తాపత్రయపడ్డాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమం చేశాడు. హోదా ఇవ్వనందుకు స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసాడు.